అసలే కరోనా కాలం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ సమయంలో కొందరు తమలోని కామాంధుడిని నిద్ర లేపుతున్నారు. అవసరం ఉన్న వాళ్లు, ఆపదలో ఉన్నవాళ్లు చేయి చాచి అడిగితే.. తమలోని మానవ మృగాన్ని నిద్ర లేపి.. తమ కోరికను తీర్చుకుంటున్నారు. అసలే కరోనాతో ఓవైపు జనం అల్లాడుతుంటే.. ఆడపిల్లలు మాత్రం కామాంధుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. కరోనా వచ్చినా కామాంధులు యువతులను వదలడం లేదు. ఓవైపు చావు బతుకుల మధ్య ఉన్నా.. వాళ్లకు తమ కామమే గుర్తుకు వస్తోంది. ఇలాంటి నీచ ఘటన ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
మా నాన్నకు శ్వాస ఆడటం లేదు.. ఆక్సిజన్ సిలిండర్ కావాలి.. ప్లీజ్ హెల్ప్ చేయండి అని అభ్యర్థించిన ఓ యువతితో ఓ ప్రబుద్ధుడు వికృత చేష్టలు చేశాడు. తనతో పడుకుంటేనే ఆక్సిజన్ సిలిండర్ ఇస్తానంటూ పట్టుబట్టాడు. ఈ ఘటన ఢిల్లీలోని ఎలైట్ కాలనీలో చోటు చేసుకుంది. అదే కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే.. ఆయనకు శ్వాసకు సంబంధించిన సమస్యలు వచ్చాయి. ఊపిరి ఆడలేదు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేకపోవడంతో.. ఎక్కడైనా బయట నుంచి ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకోవాలని డాక్టర్లు సూచించారు.
దీంతో.. కరోనా వచ్చిన వ్యక్తి కూతురు.. తన ఫ్రెండ్ ను సాయం కోరింది. దీంతో ఆమె తన ఇంటికి దగ్గర్లో ఉండే ఒక యువకుడికి ఈ విషయం చెప్పింది. దీంతో తన దగ్గర ఆక్సిజన్ సిలిండర్ ఉందని.. కావాలంటే ఇస్తానని ఆ యువకుడు చెప్పాడు. కాకపోతే.. ఆ యువతిని తన వద్ద రాత్రి పడుకోవాలని నీచంగా మాట్లాడాడు. అలా అయితేనే ఆక్సిజన్ సిలిండర్ ఇస్తా అంటూ పట్టుబట్టాడు. అతడి మాటలు విని షాక్ అయిన యువతి.. వేరే మార్గం ద్వారా ఆక్సిజన్ సిలిండర్ ను తీసుకొచ్చి తన నాన్న ప్రాణాలను కాపాడుకుంది. అయితే.. ఈ విషయాన్ని ఆ యువతి ఫ్రెండ్ అయిన మరో అమ్మాయి.. ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.
నా ఫ్రెండ్ చెల్లిల.. నాకు కూడా చెల్లి లాంటిదే. తనను ఎలైట్ కాలనీలో ఓ యువకుడు వరుసకు తనకు అన్నయ్య అవుతాడు. ఆ యువకుడు.. తనను రాత్రి మొత్తం పడుకుంటే ఆక్సిజన్ సిలిండర్ ఇస్తా అని మంకు పట్టుపట్టాడు. ఆ సమయంలో తనకు ఆక్సిజన్ సిలిండర్ ఎంతో అవసరం. ఇటువంటి కామాంధుడికి ఎటువంటి శిక్ష వేయాలి.. మీరే చెప్పండి అంటూ ఆ యువతి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను రిక్వెస్ట్ చేసింది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.