నాతో పడుకుంటేనే ఆక్సిజన్ సిలిండర్ ఇస్తా.. ఆ టైమ్ లో యువతితో కామాంధుడి వికృత చేష్టలు.. చివ‌రికి..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

నాతో పడుకుంటేనే ఆక్సిజన్ సిలిండర్ ఇస్తా.. ఆ టైమ్ లో యువతితో కామాంధుడి వికృత చేష్టలు.. చివ‌రికి..?

అసలే కరోనా కాలం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ సమయంలో కొందరు తమలోని కామాంధుడిని నిద్ర లేపుతున్నారు. అవసరం ఉన్న వాళ్లు, ఆపదలో ఉన్నవాళ్లు చేయి చాచి అడిగితే.. తమలోని మానవ మృగాన్ని నిద్ర లేపి.. తమ కోరికను తీర్చుకుంటున్నారు. అసలే కరోనాతో ఓవైపు జనం అల్లాడుతుంటే.. ఆడపిల్లలు మాత్రం కామాంధుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. కరోనా వచ్చినా కామాంధులు యువతులను వదలడం లేదు. ఓవైపు చావు బతుకుల మధ్య ఉన్నా.. వాళ్లకు తమ కామమే గుర్తుకు […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :14 May 2021,9:30 pm

అసలే కరోనా కాలం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ సమయంలో కొందరు తమలోని కామాంధుడిని నిద్ర లేపుతున్నారు. అవసరం ఉన్న వాళ్లు, ఆపదలో ఉన్నవాళ్లు చేయి చాచి అడిగితే.. తమలోని మానవ మృగాన్ని నిద్ర లేపి.. తమ కోరికను తీర్చుకుంటున్నారు. అసలే కరోనాతో ఓవైపు జనం అల్లాడుతుంటే.. ఆడపిల్లలు మాత్రం కామాంధుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. కరోనా వచ్చినా కామాంధులు యువతులను వదలడం లేదు. ఓవైపు చావు బతుకుల మధ్య ఉన్నా.. వాళ్లకు తమ కామమే గుర్తుకు వస్తోంది. ఇలాంటి నీచ ఘటన ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.

shameless incident in delhi for oxygen cylinder

shameless incident in delhi for oxygen cylinder

మా నాన్నకు శ్వాస ఆడటం లేదు.. ఆక్సిజన్ సిలిండర్ కావాలి.. ప్లీజ్ హెల్ప్ చేయండి అని అభ్యర్థించిన ఓ యువతితో ఓ ప్రబుద్ధుడు వికృత చేష్టలు చేశాడు. తనతో పడుకుంటేనే ఆక్సిజన్ సిలిండర్ ఇస్తానంటూ పట్టుబట్టాడు. ఈ ఘటన ఢిల్లీలోని ఎలైట్ కాలనీలో చోటు చేసుకుంది. అదే కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే.. ఆయనకు శ్వాసకు సంబంధించిన సమస్యలు వచ్చాయి. ఊపిరి ఆడలేదు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేకపోవడంతో.. ఎక్కడైనా బయట నుంచి ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకోవాలని డాక్టర్లు సూచించారు.

వరసకు చెల్లి అయినా కూడా వదల్లేదు

దీంతో.. కరోనా వచ్చిన వ్యక్తి కూతురు.. తన ఫ్రెండ్ ను సాయం కోరింది. దీంతో ఆమె తన ఇంటికి దగ్గర్లో ఉండే ఒక యువకుడికి ఈ విషయం చెప్పింది. దీంతో తన దగ్గర ఆక్సిజన్ సిలిండర్ ఉందని.. కావాలంటే ఇస్తానని ఆ యువకుడు చెప్పాడు. కాకపోతే.. ఆ యువతిని తన వద్ద రాత్రి పడుకోవాలని నీచంగా మాట్లాడాడు. అలా అయితేనే ఆక్సిజన్ సిలిండర్ ఇస్తా అంటూ పట్టుబట్టాడు. అతడి మాటలు విని షాక్ అయిన యువతి.. వేరే మార్గం ద్వారా ఆక్సిజన్ సిలిండర్ ను తీసుకొచ్చి తన నాన్న ప్రాణాలను కాపాడుకుంది. అయితే.. ఈ విషయాన్ని ఆ యువతి ఫ్రెండ్ అయిన మరో అమ్మాయి.. ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.

shameless incident in delhi for oxygen cylinder

shameless incident in delhi for oxygen cylinder

నా ఫ్రెండ్ చెల్లిల.. నాకు కూడా చెల్లి లాంటిదే. తనను ఎలైట్ కాలనీలో ఓ యువకుడు వరుసకు తనకు అన్నయ్య అవుతాడు. ఆ యువకుడు.. తనను రాత్రి మొత్తం పడుకుంటే ఆక్సిజన్ సిలిండర్ ఇస్తా అని మంకు పట్టుపట్టాడు. ఆ సమయంలో తనకు ఆక్సిజన్ సిలిండర్ ఎంతో అవసరం. ఇటువంటి కామాంధుడికి ఎటువంటి శిక్ష వేయాలి.. మీరే చెప్పండి అంటూ ఆ యువతి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను రిక్వెస్ట్ చేసింది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది