Shami | గర్ల్ ఫ్రెండ్ పిల్లలకి లక్షలు పెడుతున్నాడు..కూతురిని పట్టించుకోవడం లేదు.. షమీ మాజీ భార్య ఆరోపణలు
Shami | భారత క్రికెటర్ మహ్మద్ షమీ, అతని మాజీ భార్య హసీన్ జహాన్ మధ్య వివాదం రోజు రోజుకి ముదిరిపోతుంది. తమ కూతురు ఐరా చదువును షమీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడని, కానీ తన ప్రియురాలి పిల్లల చదువుల కోసం మాత్రం లక్షలు ఖర్చు చేస్తున్నాడంటూ హసీన్ జహాన్ తాజాగా సంచలన ఆరోపణలు చేసింది.

#image_title
షమీపై ఆరోపణలు..
హసీన్ జహాన్ తన పోస్టుల్లో, “నా కూతురి తండ్రి కోటీశ్వరుడు కానీ, ఓ స్త్రీలోలుడిగా మారిపోయాడు. ఐరా జీవితంతో చెలగాటమాడుతున్నాడు. ప్రియురాలి పిల్లల చదువులకు లక్షలు ఖర్చు చేస్తాడు. కానీ, కన్న కూతురి చదువు విషయానికొచ్చేసరికి డబ్బు లేదని అంటున్నాడంటూ ఘాటు కామెంట్స్ చేసింది.
షమీ తన ప్రియురాలి పిల్లలను ఖరీదైన పాఠశాలల్లో చదివిస్తూ వారికి బిజినెస్ క్లాస్ విమాన టికెట్లకు కూడా లక్షలు ఖర్చు చేస్తున్నాడని హసీన్ ఆరోపించింది. అయితే, తన కూతురు ఐరా ఇటీవల ఓ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పాఠశాలలో చేరినట్లు జహాన్ పేర్కొంది. “నా కూతురు మంచి పాఠశాలలో చేరకుండా శత్రువులు ఎన్నో కుట్రలు చేశారు. కానీ దేవుడి దయ వల్ల వాళ్ల పన్నాగాలు విఫలం అయ్యాయి” అని ఆమె తన పోస్టులో రాసుకొచ్చింది.