Health Tips | తేనె, నిమ్మకాయతో గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోకపోతే ప్రమాదమే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips | తేనె, నిమ్మకాయతో గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోకపోతే ప్రమాదమే!

 Authored By sandeep | The Telugu News | Updated on :24 August 2025,7:00 am

Health Tips | ప్రస్తుత కాలంలో బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయ కలిపి తాగడం సాధారణంగా చూస్తున్నాం. ఈ మిశ్రమంలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు శరీరాన్ని డిటాక్స్ చేయడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయని నమ్మకం. అయితే ఇది అందరికీ అనుకూలం కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

#image_title

ఇవి తెలుసుకోండి..

ఈ మిశ్రమం తీసుకోవడంవల్ల ప్రయోజనాలకన్నా కొన్ని సందర్భాల్లో దుష్ప్రభావాలే ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందంటున్నారు. ఆమ్లత (Acidity) ఉన్నవారికి జాగ్రత్త . వీటి మిశ్రమం కొన్ని మందికి చేదుగా అనిపించవచ్చు. ఇది కడుపులో ఆమ్లతను మరింత పెంచి, అసిడిటీ సమస్యను పెంచే అవకాశం ఉంది. నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ కారణంగా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

వేడి నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగడం వల్ల అల్సర్‌ సమస్య తీవ్రతరం కావచ్చు . నిమ్మకాయలోని ఆమ్ల పదార్థాలు అల్సర్‌ను పెంచుతాయి. తేనె వేడి నీటిలో కలిస్తే ఇది మరింత ప్రభావాన్ని చూపుతుంది. నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ , మూత్రపిండాల్లో కాల్షియం ఆక్సలేట్ పెరగడానికి కారణమవుతుంది. ఇది రాళ్ల సమస్యను పెంచే అవకాశం ఉంది. అలాంటి వారు ఈ మిశ్రమాన్ని నివారించాలి. నిత్యం తేనె-నిమ్మకాయ గోరువెచ్చని నీరు తాగడం వల్ల దంతాల ఎనామెల్ బలహీనపడుతుంది. దీని వల్ల దంతక్షయం, దంత సున్నితత్వం వంటి సమస్యలు రావచ్చు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది