Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి హెచ్చరికలు చిన్నప్పటి నుంచే మన చెవిన పడుతుంటాయి. కానీ వీటి వెనుక ఉన్న అసలు కారణం తెలుసా?
#image_title
మూడు బాటల దగ్గర దయ్యాలా?
పాతకాలంలో జ్యోతిష్యం, భక్తి, శాస్త్రం అన్ని కలగలసిన జీవన విధానం ఉండేది. చెడు శక్తులు దరిచేరకుండా ఉండాలని పెద్దలు నమ్మేవారు. దిష్టి తొలగించేందుకు నిమ్మకాయలు, మిరపకాయలు ఉపయోగించేవారు. దిష్టి తీయడం పూర్తయిన తర్వాత వాటిని రోడ్డుపై పడేస్తారు. అవి చెడు శక్తులను గ్రహించాయని నమ్మకం ఉండేది. అందుకే వాటిని తొక్కితే లేదా దాటితే ఆ చెడు శక్తులు మనపై ప్రభావం చూపుతాయని పెద్దలు హెచ్చరించేవారు.
“మూడు బాటల దగ్గర దయ్యాలు తిరుగుతాయి” అన్న మాట కూడా అదే నమ్మకాల మూలం. పాత కాలంలో ఆ ప్రాంతాలు వెలుతురు లేని చీకటి ప్రదేశాలుగా ఉండేవి. జంతువులు, పాములు తిరుగుతూ ఉండేవి. అందువల్ల ఆ ప్రమాదాలనుంచి ప్రజలను దూరంగా ఉంచేందుకు పెద్దలు “దయ్యాలు తిరుగుతాయి” అనే మాటతో భయపెట్టేవారని పరిశోధకులు చెబుతున్నారు. అంటే అది భయపెట్టే పద్ధతిలో ఇచ్చిన జాగ్రత్త హెచ్చరిక మాత్రమే.