SIIMA | అట్ట‌హాసంగా సైమా అవార్డ్ వేడుక‌లు.. ఉత్త‌మ న‌టుడు, న‌టి ఎవ‌రంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SIIMA | అట్ట‌హాసంగా సైమా అవార్డ్ వేడుక‌లు.. ఉత్త‌మ న‌టుడు, న‌టి ఎవ‌రంటే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :6 September 2025,12:00 pm

SIIMA | సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2025 దుబాయ్ లో ఘనంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు ఈ వేడుక జ‌ర‌గ‌నుండ‌గా, మొదటి రోజు తెలుగు సినిమాలకు అవార్డులు ద‌క్కాయి. అందులో ‘పుష్ప 2’కు నాలుగు అవార్డ్స్ వచ్చాయి. రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’, తేజా సజ్జా – ప్రశాంత్ వర్మల ‘హనుమాన్’ సైతం సత్తా చాట‌గా, ‘సైమా 2025’లో ఉత్తమ సినిమాగా ‘కల్కి 2898 ఏడీ’ ఎంపిక అయ్యింది.

#image_title

ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్)గా ప్రశాంత్ వర్మ, ఉత్తమ నటుడు (క్రిటిక్స్)గా తేజ సజ్జా నిలిచారు

సైమా అవార్డ్స్ 2025 లిస్ట్ చూస్తే..

ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
ఉత్తమ దర్శకుడు: సుకుమార్
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): ప్రశాంత్ వర్మ
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (Allu Arjun)
ఉత్తమ నటుడు: (క్రిటిక్స్) – తేజ సజ్జా
ఉత్తమ నటి: రష్మిక మందన్నా
ఉత్తమ నటి (క్రిటిక్స్): మీనాక్షి చౌదరి
ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్
ఉత్తమ సహాయ నటి: అన్నే బెన్

ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ)
ఉత్తమ గీత రచయిత: రామ్ జోగయ్య శాస్త్రి
ఉత్తమ గాయకుడు: శంకర్ బాబు కందుకూరి
ఉత్తమ గాయని: శిల్పా రావు
ఉత్తమ ప్రతినాయకుడు: కమల్ హాసన్ (Kamal Haasan)
ఉత్తమ పరిచయ నటి: పంకూరి, భాగ్యశ్రీ బోర్సే
ఉత్తమ పరిచయ నటుడు: సందీప్ సరోజ్
ఉత్తమ పరిచయ దర్శకుడు: నంద కిషోర్ యేమని
ఉత్తమ కొత్త నిర్మాత: నిహారిక కొణిదెల
ఉత్తమ ఛాయాగ్రాహకుడు: రత్నవేలు
ఉత్తమ హాస్యనటుడు: సత్య

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది