Heart | గుండెపోట్లకు రహస్య శత్రువులు .. ఈ అల‌వాట్లు మార్చుకోపోతే డేంజర్ అంటున్న వైద్య నిపుణులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heart | గుండెపోట్లకు రహస్య శత్రువులు .. ఈ అల‌వాట్లు మార్చుకోపోతే డేంజర్ అంటున్న వైద్య నిపుణులు

 Authored By sandeep | The Telugu News | Updated on :17 September 2025,11:00 am

Heart | ప్రస్తుత కాలంలో గుండెపోటు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతలోనూ గుండెపోటులు రావడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ అలవాట్లలో దాగి ఉన్న కొన్ని రహస్య శత్రువులే గుండె సమస్యలకు కారణమని చెబుతున్నారు. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని దెబ్బతీస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచే ముఖ్య పదార్థం. దాని లోపం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది.

#image_title

గుండెకు ముప్పు కలిగించే అలవాట్లు:

కూల్‌డ్రింక్స్, డెజర్ట్‌లు, సాస్‌లు, ప్యాకేజ్డ్ ఆహారాల్లో ఉండే చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచి, రక్తనాళాలలో వాపును కలిగిస్తుంది. తెల్ల రొట్టె, క్రాకర్లు, పేస్ట్రీలు శరీరంలో చక్కెరలాగే పనిచేస్తూ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. సోయాబీన్, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు నూనెలలో అధికంగా ఉండే ఒమేగా-6 కొవ్వులు వేడి చేసినప్పుడు విషపూరిత సమ్మేళనాలుగా మారి గుండెకు హాని చేస్తాయి.

పొగాకు పొగలోని రసాయనాలు నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేసే ఎంజైమ్‌లను నాశనం చేస్తాయి. యాంటీబ్యాక్టీరియల్ మౌత్‌వాష్‌లు నోటిలో ఉండే మంచి బ్యాక్టీరియాను చంపేస్తాయి. దీంతో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి తగ్గి రక్తపోటు పెరుగుతుంది. పాలకూర, బీట్‌రూట్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, దానిమ్మ, డార్క్ చాక్లెట్ వంటి ఆహారాలు నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచుతాయి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం, సరిపడా నిద్ర, ధ్యానం, ఒత్తిడి నియంత్రణ వంటి జీవనశైలి మార్పులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది