Singareni Coal Mines Operators Jobs | మహిళా డ్రైవర్లకు సింగరేణి శుభవార్త.. ఓపెన్ కాస్ట్ మైన్స్‌లో ఆపరేటర్ ఉద్యోగాలకు అవకాశం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Singareni Coal Mines Operators Jobs | మహిళా డ్రైవర్లకు సింగరేణి శుభవార్త.. ఓపెన్ కాస్ట్ మైన్స్‌లో ఆపరేటర్ ఉద్యోగాలకు అవకాశం

 Authored By sandeep | The Telugu News | Updated on :15 September 2025,6:01 pm

Singareni Coal Mines Operators Jobs | మహిళలకు శుభవార్త చెబుతూ సింగరేణి కాలరీస్‌ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ వచ్చిన మహిళా ఉద్యోగులకు ఇప్పుడు సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్‌లో (OCM) మెషిన్ ఆపరేటర్ ఉద్యోగాలకు అవకాశాలు కల్పించనుంది. ఇందుకోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

#image_title

ఇప్పటి వరకూ పురుషులే ఈ ఆపరేటర్ పనులను నిర్వహించగా, తొలిసారిగా మహిళలకూ ఆ అవకాశాన్ని అందించనుంది. ఇది సింగరేణిలో మహిళా సాధికారత దిశగా జరిగిన పెద్ద మార్పుగా అభివర్ణించబడుతోంది. సింగరేణిలో ఇప్పటికే పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల్లో డ్రైవింగ్ అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ నోటిఫికేషన్‌కు అర్హులు.

అర్హతలు:

ప్రస్తుతం సింగరేణి ఉద్యోగి అయి ఉండాలి

జనరల్ అసిస్టెంట్‌ / ట్రాన్స్‌ఫర్‌ వర్కర్‌ గా పని చేస్తుండాలి

వయస్సు 35 ఏళ్ల లోపు అయి ఉండాలి

కనీసం 7వ తరగతి పాస్ అయి ఉండాలి

టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి

డ్రైవింగ్ లైసెన్స్ 2024 ఆగస్టు నాటికి పొందినవారై ఉండాలి

శారీరకంగా పనికి సరిపోయే సామర్థ్యం కలిగి ఉండాలి

దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది?

ఆసక్తి ఉన్న మహిళా ఉద్యోగులు తమ శాఖ మేనేజర్‌ లేదా జీఎం ఆఫీస్‌లో దరఖాస్తు సమర్పించాలి

దరఖాస్తులను చీఫ్ ప్లానింగ్ ప్రాజెక్ట్ కమిటీ పరిశీలిస్తుంది

అర్హతలను బట్టి స్క్రూటినీ చేసి, ఎంపికైన వారికి ట్రైనింగ్ అవకాశం కల్పిస్తారు

ట్రైనింగ్ అనంతరం ఖాళీల ఆధారంగా పరీక్ష నిర్వహించి, అర్హులైన వారికి ఉద్యోగ నియామకాలు చేస్తారు

Also read

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది