Omicron : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని గడ గడ లాడిస్తోంది. మళ్ళీ రోజురోజుకు కేసులు పెరుగుతూ పోతున్నాయి. తాజా చూస్తూ ఉంటే ఒమిక్రాన్ మూడో వేవ్ కి సంకేతమా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో భారీగా పెరిగిపోతున్న కేసుల దృష్ట్యా ఆయా దేశాలు అక్కడ లాక్‌డౌన్ ప్రకటిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాలని కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇకపోతే ఈ తాజా వేరియంట్ విషయంలో శాస్త్రవేత్తలు ఇప్పటికే పరిశోధనలను వేగవంతం చేశారు. ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇంతవరకు పెద్దగా ఓ అంచనాకు రాలేదు. ఇతర వైవిధ్యాలతో పోలిస్తే ఒమిక్రాన్ మరింతగా వ్యాపిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీని గురించిన అధ్యయనాలు కొనసాగుతోనే ఉండగా.. తాజాగా లండన్ కింగ్స్ కాలేజీ, హెల్త్ సైన్స్ కంపెనీ జెడ్‌ఓఈ సంయుక్తంగా నిర్వహించిన ఓ పరిశోధన… ఓ షాకింగ్ న్యూస్ బయటపెట్టింది.
ఒమిక్రాన్ లక్షణాలపై చేపట్టిన ఈ రీసెర్చ్ లో ఎన్నో అంశాలు వెల్లడైనట్లు లండన్ కింగ్స్ కాలేజీ, హెల్త్ సైన్స్ కంపెనీ జెడ్‌ఓఈలు తెలిపాయి.అసాధారణంగా చర్మంపై దద్దుర్లు, దురద వస్తే అది ఒమిక్రాన్ కావచ్చునని వారు పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ రోగుల్లో 8.8 శాతం మందిలో చర్మంపై దద్దుర్లు ఉన్నట్లు కనుగొన్నామని తెలిపారు. ఈ పరిస్థితుల్లో చర్మంపై వచ్చే అసాధారణ మార్పుల విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.దగ్గు, జలుబు, జ్వరంతో పాటు చర్మంపై వచ్చే దద్దుర్లు కూడా ఓ లక్షణమని గుర్తించాలని తెలిపింది. వైరస్‌ను తొలిదశలోనే గుర్తించేందుకు ఇది ఎంతో ఉపయోగపడనుందని స్పష్టం చేసింది. అయితే, అలర్జీ వల్ల వచ్చే దద్దుర్లతో పోలిస్తే.. వైరస్ వల్ల ఏర్పడే దద్దుర్లు ఎర్రగా.. ఉబ్బినట్లుగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు.
ఒమిక్రాన్ బారిన పడిన 3.36లక్షల మంది డేటా నుంచి వివరాలు సేకరించి అధ్యయనం చేసినట్లు తెలిపారు. అయితే ప్రధానంగా ఈ లక్షణాలు ఎక్కువగా యువతలో కనిపించాయని పేర్కొన్నారు.కరోనా పాజిటివ్ రోగుల్లో 8.8 వాతం మందికి చర్మంపై దద్దుర్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. భారత్ తో పోలిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు భారీగా ఉంటున్నాయి. యూ ఎస్, లండన్ లో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దీంతో పాటు.. జ్వరం, దగ్గు, అలసట, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి కోవిడ్ లక్షణాలే ఒమిక్రాన్ లోనూ ఉంటాయని తెలుస్తోంది. కళ్లు అలసటగా, ఎరుపు రంగులోకి మారటం, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు, వేళ్లు లేదా కాలి రంగు మారడం వంటి లక్షణాలు తక్కువగా ఉంటాయట. వీటిల్లో ఏవైనా మీకు ఉంటే వెంటనే మీ దగ్గరలోని వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి
Birth Certificate : ఆంధ్రప్రదేశ్ లో ఈమధ్య అన్ని గుర్తింపు ధృవీకరణ పత్రాలు.. ప్రభుత్వ సేవలకు యాక్సెసింగ్ చాలా ఈజీ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్గా 12 వారాలు పూర్తి చేసుకోగా,…
Termites : సాధారణంగా ఇంట్లో చెదలు పట్టడం అనేది సాధారణమైన విషయం. అయితే ఈ చెదలు అనేవి చూడడానికి చిన్నగా ఉన్నా…
Siddharth Vs Allu Arjun : డిసెంబర్ 5న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రం భారీ…
Vitamin D : మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ లలో విటమిన్ డీ కూడా ఒకటి. అయితే మన శరీరంలో…
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
This website uses cookies.