Chiranjeevi : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. తెలంగాణలో ఒక మోస్తరుగా ఉన్న బీజేపీ ఏపీలో కూడా తమ ఉనికి చాటుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. వివాదంతోనో లేదా మరో విధంగానో ఏపీ రాజకీయాల్లో తమ పాత్ర ఉండాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. బీజేపీ రాజకీయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీపై కూడా పడ్డట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే జనసేన పార్టీ మరియు బీజేపీ లు మిత్ర పక్షాలుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మద్దతుతో ఏపీ మరియు తెలంగాణలో కుమ్మేయాలని బీజేపీ భావిస్తుంది. అందుకోసం ఇంకాస్త పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. జనసేన పార్టీ అధినేత పవన్ తమ పక్షాణ ఉండటం వల్ల బలం పెరిగడం ఖాయం. ఇదే సమయంలో మెగాస్టార్ మరియు వారి అభిమానులు కూడా బీజేపీని నమ్మాలి.. వెంట రావాలి అని పార్టీ అధినాయకత్వం భావిస్తుంది. అందుకే పరామర్శలు పెట్టినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ను స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించాడు. యాక్సిడెంట్ అయ్యి నెలలు గడుస్తున్నాయి.. పూర్తిగా కోలుకుని మళ్లీ షూటింగ్ లకు రెడీ అవుతున్న సాయి ధరమ్ తేజ్ ను కిషన్ రెడ్డి కలవడం చర్చనీయాంశంగా మారింది. సాయి ధరమ్ తేజ్ ను కలవడం వల్ల ఖచ్చితంగా చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ లకు మరింతగా దగ్గర అయ్యే అవకాశం బీజేపీ కి దక్కతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకే మెగాస్టార్ చిరంజీవి ని మచ్చిక చేసుకుని న్యూట్రల్ గా ఉన్న ఆయన బీజేపీ కి మద్దతుగా మాట్లాడటం లేదా తమ్ముడు జనసేన పార్టీ ద్వారా అయినా బీజేపీకి మద్దతుగా నిలవడం చేస్తాడనే ఉద్దేశ్యంతో బీజేపీ ఈ వ్యూహంను అమలు చేసి ఉంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ నాయకులు ఏం చేసినా కూడా రాజకీయం అనడంలో తప్పు లేదు. వారు వేసే ప్రతి అడుగు కూడా రాజకీయంగా ఆలోచించి వేస్తారు. కనుక సాయి ధరమ్ తేజ్ ను కలిసి మాట్లాడటం.. పరామర్శించడం ఊరికే అంటే ఇక్కడ నమ్మడానికి ఎవరు సిద్దంగా లేరు. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా ఫ్యాన్స్ ను బీజేపీ వైపు మరల్చుకోవడానికి మరియు జనసేనతో మరింత సన్నిహిత్యం పెంచుకోవడానికి బీజేపీ ఇలా వ్యవహరించి ఉంటుంది అనేది కొందరు రాజకీయ విశ్లేషకుల వాదన. తెలంగాణ మరియు ఏపీలో బీజేపీకి చిరు, పవన్, మెగా ఫ్యాన్స్ మద్దతు ఉంటే ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకం ఆ పార్టీ వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజంగానే బీజేపీ ఉనికి కాపాడుకోగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఆ ఉద్దేశ్యంతోనే కిషన్ రెడ్డి సుప్రీం హీరోను కలిసి ఉంటాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.