Omicron : అలెర్ట్.. రోజు రోజుకి భ‌య‌పెడుతున్న ఓమిక్రాన్… ఈ కొత్త ల‌క్ష‌ణాలు ఉన్నా క‌రోనానే కావ‌చ్చు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Omicron : అలెర్ట్.. రోజు రోజుకి భ‌య‌పెడుతున్న ఓమిక్రాన్… ఈ కొత్త ల‌క్ష‌ణాలు ఉన్నా క‌రోనానే కావ‌చ్చు..!

 Authored By kranthi | The Telugu News | Updated on :2 January 2022,2:20 pm

Omicron : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని గడ గడ లాడిస్తోంది. మళ్ళీ రోజురోజుకు కేసులు పెరుగుతూ పోతున్నాయి. తాజా చూస్తూ ఉంటే ఒమిక్రాన్ మూడో వేవ్ కి సంకేతమా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో భారీగా పెరిగిపోతున్న కేసుల దృష్ట్యా ఆయా దేశాలు అక్కడ లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాలని కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇకపోతే ఈ తాజా వేరియంట్ విషయంలో శాస్త్రవేత్తలు ఇప్పటికే పరిశోధనలను వేగవంతం చేశారు. ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇంతవరకు పెద్దగా ఓ అంచనాకు రాలేదు. ఇతర వైవిధ్యాలతో పోలిస్తే ఒమిక్రాన్ మరింతగా వ్యాపిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీని గురించిన అధ్యయనాలు కొనసాగుతోనే ఉండగా.. తాజాగా లండన్‌ కింగ్స్‌ కాలేజీ, హెల్త్‌ సైన్స్‌ కంపెనీ జెడ్‌ఓఈ సంయుక్తంగా నిర్వహించిన ఓ పరిశోధన… ఓ షాకింగ్ న్యూస్ బయటపెట్టింది.

Omicron : చర్మంపై దద్దుర్లు వస్తున్నాయా.. ఒమిక్రానే కావొచ్చు..!

ఒమిక్రాన్ లక్షణాలపై చేపట్టిన ఈ రీసెర్చ్ లో ఎన్నో అంశాలు వెల్లడైనట్లు లండన్‌ కింగ్స్‌ కాలేజీ, హెల్త్‌ సైన్స్‌ కంపెనీ జెడ్‌ఓఈలు తెలిపాయి.అసాధారణంగా చర్మంపై దద్దుర్లు, దురద వస్తే అది ఒమిక్రాన్ కావచ్చునని వారు పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ రోగుల్లో 8.8 శాతం మందిలో చర్మంపై దద్దుర్లు ఉన్నట్లు కనుగొన్నామని తెలిపారు. ఈ పరిస్థితుల్లో చర్మంపై వచ్చే అసాధారణ మార్పుల విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.దగ్గు, జలుబు, జ్వరంతో పాటు చర్మంపై వచ్చే దద్దుర్లు కూడా ఓ లక్షణమని గుర్తించాలని తెలిపింది. వైరస్‌ను తొలిదశలోనే గుర్తించేందుకు ఇది ఎంతో ఉపయోగపడనుందని స్పష్టం చేసింది. అయితే, అలర్జీ వల్ల వచ్చే దద్దుర్లతో పోలిస్తే.. వైరస్‌ వల్ల ఏర్పడే దద్దుర్లు ఎర్రగా.. ఉబ్బినట్లుగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు.

skin damage is one of corona new varient Omicron symptom

skin damage is one of corona new varient Omicron symptom

ఒమిక్రాన్ బారిన పడిన 3.36లక్షల మంది డేటా నుంచి వివరాలు సేకరించి అధ్యయనం చేసినట్లు తెలిపారు. అయితే ప్రధానంగా ఈ లక్షణాలు ఎక్కువగా యువతలో కనిపించాయని పేర్కొన్నారు.కరోనా పాజిటివ్ రోగుల్లో 8.8 వాతం మందికి చర్మంపై దద్దుర్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. భారత్ తో పోలిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు భారీగా ఉంటున్నాయి. యూ ఎస్, లండన్ లో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దీంతో పాటు.. జ్వరం, దగ్గు, అలసట, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి కోవిడ్ లక్షణాలే ఒమిక్రాన్ లోనూ ఉంటాయని తెలుస్తోంది. కళ్లు అలసటగా, ఎరుపు రంగులోకి మారటం, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు, వేళ్లు లేదా కాలి రంగు మారడం వంటి లక్షణాలు తక్కువగా ఉంటాయట. వీటిల్లో ఏవైనా మీకు ఉంటే వెంటనే మీ దగ్గరలోని వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది