Vehicle Insurance Rates : స్వల్పంగా పెరిగిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రేట్లు .. జూన్ ఒకటి నుంచే అమలు
Vehicle Insurance Rates : వాహనాల థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ ధరలు పెరగనున్నాయి. గతంలో ఉన్న ప్రీమియం రేట్లను స్వల్పంగా పెంచుతూ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ)తో సంప్రదించి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్, హైవేస్ ధరలను నోటిఫై చేసింది. ఈ పెంచిన ధరలు జూన్ ఒకటి నుంచి అమలు చేయనున్నారు.కాగా ప్రస్తుతం ఉన్న ప్రీమియం 1000 సీసీ వెయికల్స్ కి గతంలో రూ. 2,072 గా ఉండగా ఇప్పుడు.. రూ.2094 గా నిర్ణయించారు.
అలాగే 1500 సీసీ వెయికల్స్ కి గతంలో ఉన్న రూ. 3,221 కి అదనంగా రూ.195 పెంచుతూ రూ.3416 చెల్లించాలి. ఇక 1500 కంటే ఎక్కువగా ఉన్న కార్లకు ప్రీమియం రూ. 7,890 నుంచి రూ.7,897 గా పెంచింది. అలాగే 150 నుంచి 350 సీసీ సామర్థ్యం ఉన్న బైకులకు రూ.1,366, అలాగే 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉంటే రూ.2,804 గా ఉంది.అలాగే ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్లకు 30 కిలోవాట్ లోపు రూ.1,780 చెల్లించాలి. అలాగే 30 నుంచి 65 కిలోవాట్ సామర్థ్యం ఉన్న వాహనాలకు రూ.2,904 చెల్లించాలి.
Vehicle Insurance Rates : ఎలక్ట్రిక్ వాహనాల ప్రీమియం రేట్లు ..
అయితే 30 కిలో వాట్ ఎలక్ట్రానిక్ ప్రైవేటు వాహనాలకు మూడు సంవత్సరాల సింగిల్ ప్రీమియం రూ.5543 అందుబాటులో ఉంది. అలాగే 65 కిలో వాట్ కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న వాహనాలకు రూ.9044 గా నిర్ణయించారు. అలాగే 12 నుంచి 30 వేల కిలోలు మోయగల సామర్థ్యం ఉన్న సరుకు రవాణా వాణిజ్య వాహనాలకు ప్రీమియం రూ.33,414 నుంచి రూ.35,313కి పెంచింది. అలాగే 40 వేలకుపైగా కిలోల సామర్థ్యం గల వాహనాలకు రూ.41,561 నుంచి రూ.44,242 గా నిర్ణయించారు.