Dried Chillies | ఎండు మిరపతో ఎన్నో లాభాలు.. ఆరోగ్యంలో చేర్చుకుంటే చాలా ఉపయోగం..!
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని నిపుణులు సూచిస్తున్నారు. మనం వంటల్లో తరచుగా ఉపయోగించే ఎండు మిర్చి, ముఖ్యంగా తాళింపు, రోటి పచ్చళ్లు వంటి వంటల్లో రుచి పెంచే ప్రధాన పదార్థంగా ఉంటుంది. భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, కారం ఎక్కువగా తింటారు. ఈ కారం మితంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉంటాయి.
#image_title
చాలా ఉపయోగాలు..
ఎండు మిర్చి తినడం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా శరీరం వ్యాధులతో పోరాడే సామర్థ్యం పొందుతుంది. బరువు తగ్గించుకోవాలనుకునేవారు కూడా ఎండు మిర్చి వాడటం ద్వారా గుండె, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గించుకోవచ్చు. కారం తినడం గుండె సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది, ధమనుల్లోని అధిక కొవ్వు కరుగుతుంది, అలాగే బీపీ, షుగర్ వంటి వ్యాధులు కంట్రోల్‌లో ఉంటాయి.
అంతేకాకుండా ఎండు మిర్చి, ముఖ్యంగా రెడ్ చిల్లీ, ట్యూమర్, వాపులు, జలుబు, దగ్గు, జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రెడ్ చిల్లీని మితంగా తీసుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది, అకాల మరణం సంభవించే అవకాశం తక్కువగా ఉంటుంది, కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ విధంగా, వంటలో ఎండు మిర్చిని సరైన మోతాదులో ఉపయోగించడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు, నిపుణులు చెబుతున్నారు.