Home » News » Social Trolls On Bigg Boss Show Due To Jabardasth Comedian Pulling
News

Bigg Boss 6 Telugu : పనికి మాలిన బిగ్‌ బాస్.. జబర్దస్త్‌ వారు తప్ప మరెవ్వరు లేరా?

Authored By
aruna
The Telugu News | Published on: September 5, 2022, 5:30 pm
Advertisement

Bigg Boss 6 Telugu : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమైంది. నిన్న ఆదివారం లాంఛనంగా సాయంత్రం ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నట్లుగా కార్యక్రమం నిర్వాహకులు మరియు ఛానల్ యాజమాన్యం చెబుతోంది. ఇదే సమయంలో కొందరు బిగ్ బాస్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా జబర్దస్త్ అభిమానులు బిగ్ బాస్ టీం పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. డబ్బు ఆశ చూపించి జబర్దస్త్ కమెడియన్స్ ను ఇప్పటికే స్టార్ మా తమ ఛానల్ లోకి లాగేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఫైమా మరియు చలాకి చంటి లను కూడా జబర్దస్త్ నుండి లాగేసుకోవడంతో ఆ కార్యక్రమం కు మరింతగా డ్యామేజ్ అయింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

మరి దారుణంగా బిగ్ బాస్ షో నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని, పనికి మాలిన షో అయినా బిగ్ బాస్ కోసం జబర్దస్త్ వంటి కల్పవృక్షం తరహా కార్యక్రమాన్ని వదులు కోవడం ఆ కమెడియన్స్ యొక్క అవివేకం అంటూ జబర్దస్త్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు ఆశ చూపించడంతో తాత్కాలిక ఆనందం కోసం వారు జబర్దస్త్ ని వీడి వెళ్లారు తప్పితే కచ్చితంగా వారు తర్వాత బాధపడాల్సి వస్తుందని, వారి యొక్క పనికి వారే భవిష్యత్తులో ఆవేదన చెందాల్సి వస్తుంది అంటూ జబర్దస్త్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ లో ఫైమా కి మంచి గుర్తింపు దక్కింది.

social media trolls on bigg boss 6 telugu show due to jabardasth comedian pulling

Advertisement

కానీ ఇప్పుడు ఆమె ఆ గుర్తింపును ఉపయోగించుకొని బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇది ఏ మాత్రం ఆమెకు న్యాయం కాదని.. ఆమె లేక పోవడంతో బుల్లెట్ భాస్కర్ టీం చాలా నష్టపోతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జబర్దస్త్ కార్యక్రమం నుండి ప్రతి సీజన్ బిగ్ బాస్ కి ఎవరో ఒకరు కమెడియన్ వెళుతూనే ఉన్నారు. ఈసారి జబర్దస్త్ నుండి ఇద్దరు కమెడియన్స్ వెళ్లడం తో అక్కడ ఎంటర్టైన్మెంట్ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జబర్దస్త్‌ కమెడియన్స్ మాత్రం స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. ఫైమా మరియు చంటి లు ఇక ఎప్పటికి జబర్దస్త్‌ స్టేజ్ పై కనిపించే అవకాశం లేదు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి