Chandrababu : అమరావతి రైతుల ఏడుపుకు చంద్రబాబు కారణం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : అమరావతి రైతుల ఏడుపుకు చంద్రబాబు కారణం

 Authored By prabhas | The Telugu News | Updated on :10 March 2022,6:00 am

Chandrababu : తెలుగు దేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంత రైతులకు మరియు జనాలకు చేసిన అన్యాయం పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నం లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాటు రాజధాని నిర్మాణం పేరుతో కాలయాపన చేశాడు.దాదాపుగా ఎనిమిది వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు.ఆ సమయంలో ఆయన చేసింది ఏమీ లేదు. ప్రజలకు ప్లాట్లను ఇచ్చింది లేదు..

ప్రభుత్వ కార్యాలయాలకు మరియు పబ్లిక్ కోసం భవన నిర్మాణం చేసింది లేదు. కానీ రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల ఆస్తులను తెలుగు దేశం పార్టీ నాయకులు దోచుకున్నారు అంటూ బిజెపి నాయకులు ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉండి ఉంటే 10 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని నిర్మించి ఉండేవాళ్ళం అన్నాడు.తెలుగుదేశం పార్టీ కి ఆ విషయం చేతకాలేదు అంటూ వీర్రాజు ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అమరావతి ప్రజల, కొత్త రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చ లేక పోతున్నారు అంటూ బిజెపి అధ్యక్షుడు మండిపడ్డాడు.

somu veerraju fires on chandrababu naidu

somu veerraju fires on chandrababu naidu

చంద్రబాబు నాయుడు అతి ఆలోచన ఈ పరిస్థితికి కారణమని సోము వీర్రాజు అభిప్రాయం వ్యక్తం చేశాడు. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే రాజధాని నిర్మాణం పూర్తి అయి ఉంటే ఇప్పుడు అమరావతి ప్రజలు రోడ్డెక్కి పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. చంద్రబాబు నాయుడు మరియు జగన్మోహన్ ఇద్దరు కూడా ఏపీ ప్రజలకు ముఖ్యంగా అమరావతి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అంటూ సోము వీర్రాజు ఆరోపించాడు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది