Govt Jobs : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నేడో, రేపో తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్..!
Govt Jobs : తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్ తెలపనుంది. త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఈ నెల చివర్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల కానున్నాయని సమాచారం. ఇప్పటికే ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్స్, పోస్టింగులు దాదాపుగా పూర్తి కావడంతో వాటి ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. వచ్చే వారంలో సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్లను అనుమతి […]
Govt Jobs : తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్ తెలపనుంది. త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఈ నెల చివర్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల కానున్నాయని సమాచారం. ఇప్పటికే ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్స్, పోస్టింగులు దాదాపుగా పూర్తి కావడంతో వాటి ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. వచ్చే వారంలో సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్లను అనుమతి ఇవ్వనున్నారని టాక్. ఫేజ్ 1లో ఫిలప్ చేయనున్న ఖాళీల సంఖ్యను ఖరారు చేసేందుకు సీఎస్ సోమేశ్ కుమార్..
వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.ఖాళీలకు సంబంధించి ఇప్పటికే అధికారులు ప్రణాళికలు రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి సీఎస్ సోమేశ్ కుమార్… అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలను తెలుసుకుంటున్నారని సమాచారం. సుమారు 70 వేల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. వీటిల్లో పోలీసు ఉద్యోగాలు 17 వేలు ఉన్నట్టు సమాచారం. టీఎస్‌పీఎస్ నుంచి గ్రూప్-2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్‌ను సైతం విడుదల చేయాలని అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని కొంత కాలంగా ప్రభుత్వం ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.
Govt Jobs : 70 వేల పోస్టుల భర్తీకి ప్లాన్
రాష్ట్రంలో కొత్త జిల్లాల వారీగా ఉద్యోగులను కేటాయించిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేస్తామని తాజాగా సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపు పూర్తికావడంతో ఖాళీ భర్తీపై సర్కారు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఒక వేళ నోటిఫికేషన్స్ ఇప్పుడు వేసినా పరీక్షలను మాత్రం ఎన్నికల సమయం వరకు ప్రభుత్వం తీసుకెళ్తుందని నిరుద్యోగుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కొందరైతే నోటిఫికేషన్లు వెలువడటం కష్టమే అనే అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు.