NIRDPR Recruitment : పంచాయతీ రాజ్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలిస్తే నోరెళ్లపెడతారు..!
ప్రధానాంశాలు:
NIRDPR Recruitment : పంచాయతీ రాజ్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలిస్తే నోరెళ్లపెడతారు..!
NIRDPR Recruitment : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ మరియు జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ కోసం 33 ఆధారిత ఖాళీలు ప్రకటించింది. నెలకి లక్ష నుండి లక్ష 90 వేల వరకు అధిక జీతం అందించే ఈ ఉద్యోగం, తాజా గ్యాడ్యుయేట్లు, కెరీర్ మధ్యలో ఉన్న నిపుణులు మరియు సీనియర్ స్థాయి నిపుణులకి అనువైనదిగా చెబుతున్నారు.

NIRDPR Recruitment : పంచాయతీ రాజ్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలిస్తే నోరెళ్లపెడతారు..!
NIRDPR Recruitment దరఖాస్తు చివరి తేది…
ఇది దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 19,2025 చివరి తేదిగా చెబుతున్నారు. ఇది భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి సంస్థ. ఇది తెలంగాణలోని హైదారబాద్‌లో ఉండగా, ఈ సంస్త వీటిపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఇందులో గ్రామీణాభివృద్ధిలో ప్రభుత్వ అధికారులకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. గ్రామీణ పాలనని మెరుగు పరచడానికి విధాన పరిశోధన నిర్వహిస్తారు.
ఇందులో్ మొత్తం ఖాళీలు 33 ఉండగా, పోస్ట్‌లు ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్. ఇక ఉద్యోగ రకం కాంట్రాక్ట్ కాగా, స్థానం ఎన్ఐఆర్డీపీఆర్ హైదరాబాద్. ఈ పదవులు విలువైన అనుభవాన్ని అందిస్తాయి, కాని ఇవి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కావు అని గుర్తుంచుకోవాలి.వయో పరిమితి కనీసం 18 సంవత్సరాలు, గరిష్టం 60 సంవత్సరాలుగా ఉంటుంది. గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుండి ఏదైన డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత ఉండాలి.