WTC Final Scenario : భారత్ ని రిస్క్ లో పడేసిన సౌతాఫ్రికా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ రేసులో ఎవరు ఉంటారు..?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అనూహ్యంగా పాయింట్ల పట్టీలో సౌతాఫ్రికా దూసుకొచ్చింది. ఫైనల్ బెర్తు రేసు రసవత్తరంగా మార్చేందుకు దక్షిణాఫ్రికా సిద్ధమవుతుంది. భారత్ పై న్యూజిలాండ్ విజయ తో పాటు మరోపక్క బంగ్లాదేష్ పై సౌతాఫ్రికా విన్ అవ్వడంతో పాయింట్ల పట్టికలో మార్పులు జరిగాయి. టీం ఇండియా అగ్రస్థానంలో ఉన్నా కూడా విన్నింగ్ పర్సెంటేజ్ ని తగ్గేలా చేసుకుంది. లెక్కల ప్రకారం చూస్తే 6 శాతం చేజారినట్టు తెలుస్తుంది. ఆసియాలో డికేడ్ తర్వాత టెస్ట్ లో […]
ప్రధానాంశాలు:
WTC Final Scenario : భారత్ ని రిస్క్ లో పడేసిన సౌతాఫ్రికా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ రేసులో ఎవరు ఉంటారు..?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అనూహ్యంగా పాయింట్ల పట్టీలో సౌతాఫ్రికా దూసుకొచ్చింది. ఫైనల్ బెర్తు రేసు రసవత్తరంగా మార్చేందుకు దక్షిణాఫ్రికా సిద్ధమవుతుంది. భారత్ పై న్యూజిలాండ్ విజయ తో పాటు మరోపక్క బంగ్లాదేష్ పై సౌతాఫ్రికా విన్ అవ్వడంతో పాయింట్ల పట్టికలో మార్పులు జరిగాయి. టీం ఇండియా అగ్రస్థానంలో ఉన్నా కూడా విన్నింగ్ పర్సెంటేజ్ ని తగ్గేలా చేసుకుంది. లెక్కల ప్రకారం చూస్తే 6 శాతం చేజారినట్టు తెలుస్తుంది. ఆసియాలో డికేడ్ తర్వాత టెస్ట్ లో గెలిచిన సౌతాఫ్రికా టేబుల్ లో నాలుగో పొజిషన్ కు చేరింది. అంతేకాఉ 47.62 విజయ శాతంతో ఫైనల్ బెర్త్ అవకాశాలను మెరుగుపరచుకుంది. ఇక ఇదే పట్టికలో రెండో స్థానంలో ఆస్ట్రేలియా 62.50, శ్రీలంక 55.56 శాతం విజయ అవకాశాల శాతంగా కలిగి ఉన్నాయి. టాప్ 3 జట్లతో పోలిస్తే దక్షిణాత్రికా విజయ శాతం తక్కువే అయినా నెక్స్ట్ మ్యాచ్ లలో పుంజుకుంటే మాత్రం ఈ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది.
WTC Final Scenario రిస్క్ లో భారత్..
బంగ్లాదేశ్ తో సౌతాఫ్రికా మరో టెస్ట్ ఆడుతుంది. ఆ తర్వాత సొంత గడ్డపై శ్రీలంక, పాకిస్థాన్ తో రెండు టెస్ట్ లు ఉన్నాయి. ఐతే సొంత గడ్డపై సఫారీల దూకుడు తెలిసిందే. ఇక ఈ నేపథ్యంతో మిగిలిన మ్యాచుల్లో సౌతాఫ్రికా హాట్ ఫేవరెట్ గా ఉడనుంది. నెక్స్ట్ రాబోయే ఐదు మ్యాచ్ నాలుగు గెలిచినా వాళ్లకు ఫైనల్ ఛాన్స్ ఉంటుంది. ఐతే భార, ఆస్ట్రేలియా, శ్రీలంక మ్యాచ్ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
ఐతే సౌతాఫ్రికా రేసులో ఉంటే భారత్ స్థానం రిస్క్ లో పడింది. టాప్ 2 లో ఉన్న భారత్ ఫైనల్ చేరాలంటే 5 విజయాలు సాధించాల్సి ఉంది. నాలుగు గెలిచి ఒకటి డ్రా అయినా టైటిల్ పోరులో ఉండే ఛాన్స్ ఉంటుంది. టీం ఇండియా తదుపరి పోరులో న్యూజిలాండ్ తో ఒక మ్యాచ్, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ లు ఉనాయి. మరి వీటి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి