TSRTC | తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగల సందడికి TSRTC భారీ ఏర్పాట్లు.. నేటి నుంచి 7,754 ప్రత్యేక బస్సులు
TSRTC | తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రజలకు ప్రయాణంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) భారీగా 7,754 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక సర్వీసులు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2 వరకు కొనసాగనున్నాయి.

#image_title
ఎక్కడి నుంచి ఎక్కడికి?
ఈ ప్రత్యేక బస్సులు ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలకు, అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలకు నడపనున్నారు. పండుగల కాలంలో ప్రజల ప్రయాణ సౌలభ్యం మా ప్రధాన లక్ష్యం. అందుకే డిమాండ్‌కు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతున్నాం అని సజ్జనార్ తెలిపారు.
రెగ్యులర్ బస్సులలో ఉచిత ప్రయాణం కొనసాగుతుంది. స్పెషల్ బస్సులలో టికెట్ తీసుకోవాల్సిందే. TSRTC అధికార ప్రతినిధి ఎ.పి. మాధవ్ వెల్లడించినట్టు, “మహిళల ఉచిత ప్రయాణ పథకం కేవలం రెగ్యులర్ సర్వీసులకే పరిమితం. స్పెషల్ బస్సులకు అది వర్తించదు. ప్రత్యేక బస్సుల అవసరం ప్రకారం సర్‌ఛార్జ్ విధించడం జరిగింది. మేము ప్రయాణికుల భద్రత, సౌకర్యానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది అని ఎండీ సజ్జనార్ అన్నారు