Srireddy : శ్రీరెడ్డి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ వివాదం ఉన్నా క్షణాల్లో ఆ ఇష్యూపై మాట్లాడేస్తుంది. అలాగే తను కూడా నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది. మాట్లాడితే ఫేస్ బుక్ లైవ్ పెట్టేస్తుంది. ఎంతో మంది సెలబ్రెటీలపై, బడా నేతలపై కూడా ఎలాంటి భయం లేకుండా నిలదీస్తుంది. గతంలో ఇండస్ట్రీలో ఓ సెలబ్రెటీ మోసం చేశాడని నానా రచ్చ చేసింది. ఆ రచ్చతో తెలుగు రాష్ట్రాల్లో శ్రీరెడ్డి సెలబ్రెటీ అయిపోయింది. ఇక మెగా ఫ్యామిలీ గురించి అయితే శ్రీరెడ్డి ఎంతలా రియాక్ట్ అవుతదో అందరికీ తెలిసిందే.. మొన్నటికి మొన్న కరాటే కల్యాణీ, శ్రీకాంత్ రెడ్డిల ఇష్యూలో కరాటే కల్యాణీపై ఫైర్ అయింది. కాగా పొలిటికల్ గా శ్రీరెడ్డి మొదటి నుంచి వైపీపీకి మద్దతుగా నిలుస్తోంది. తనని ఏమైనా అంటే ఒక్కోసారి పట్టించుకోదేమో గానీ…
వైసీపీని ఏమైనా అంటే వాళ్ల అంతు చూడకుండా వదలదు. చంద్రబాబు, పవన్ ఇలా ఎవరైనా సరే గట్టిగానే స్పందిస్తుంది. ఇక నాగబాబు గురించి అయితే ఓ రేంజ్ లో రచ్చ చేస్తుంది. అయితే వైసీపీకి తన ఫుల్ మద్దతుని ఇచ్చినప్పటికీ ఇంత వరకు ఆ పార్టీ గుర్తించకపోవడం విశేషం. అయితే ఇప్పుడు శ్రీరెడ్డి ఉన్నట్టుండి వైపీపీపై ఫైర్ అవుతోంది. నేను వైపీపీకి మద్దతుగా మాట్లాడితే ఏదో దోచిపెడుతున్నారు అనుకోకండి.. కనీసం పట్టించుకోవడం లేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ ఏ పార్టీ అయినా సరే.. పార్టీలతో సంబంధం లేకుండా.. కార్యకర్తల్ని దూరం చూసుకోకూడదు. ఎన్నికలు దగ్గర్లో ఉన్నాయి.. ఎలా ఉన్నా మనం అధికారంలోకి వచ్చేస్తాంలే అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది.
రేపు 20 సీట్లు తగ్గినా.. 30 సీట్లు తగ్గినా జనంలో అసంతృప్తి పెరుగుతుందనే వాస్తవాన్ని అధికార పార్టీ గ్రహించాలి. అధికారం శాశ్వతం కాదనేది గ్రహించాలి. పథకాలు ఎంత బలంగా ఉన్నా.. అసంతృప్తి పెరగకుండా చూసుకోవాలి అంటూ డైరెక్ట్ గానే వైసీపీపై అసహంనం వ్యక్తం చేసింది. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే శ్రీరెడ్డి తన సొంత గ్రామంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టాలని అనుకుంది. అప్పట్లో టీడీపీ హయాంలో రిలీజ్ అయిన ఫండ్స్ తో కొంత నిర్మించగా సగంలో ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఎలాగూ మన ప్రభుత్వమే అని ఫండ్స్ కోసం ఎమ్మెల్యే, మంత్రి ఇలా ఎంతమందని సంప్రదించినా పట్టించుకోవడం లేదని వాపోయింది. ఇన్నాళ్లూ పార్టీకి మద్దతుగా నిలిచినా కనీసం గుడి నిర్మాణం విషయంలో కూడా పట్టించుకోవడం లేదని ఫీలవుతోంది. ఇకనైనా దీనిపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.