Sri Reddy : మిమ్మ‌ల్నే న‌మ్ముకున్నా.. ఒక్క‌రూపాయి కూడా ఇవ్వ‌డం లేదంటూ వైసీపీపై శ్రీ‌రెడ్డి అసంతృప్తి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sri Reddy : మిమ్మ‌ల్నే న‌మ్ముకున్నా.. ఒక్క‌రూపాయి కూడా ఇవ్వ‌డం లేదంటూ వైసీపీపై శ్రీ‌రెడ్డి అసంతృప్తి

 Authored By mallesh | The Telugu News | Updated on :8 June 2022,4:00 pm

Srireddy : శ్రీ‌రెడ్డి గురించి తెలుగు ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎక్క‌డ వివాదం ఉన్నా క్ష‌ణాల్లో ఆ ఇష్యూపై మాట్లాడేస్తుంది. అలాగే త‌ను కూడా నిత్యం వివాదాల‌తో వార్త‌ల్లో నిలుస్తుంటుంది. మాట్లాడితే ఫేస్ బుక్ లైవ్ పెట్టేస్తుంది. ఎంతో మంది సెల‌బ్రెటీల‌పై, బ‌డా నేత‌ల‌పై కూడా ఎలాంటి భ‌యం లేకుండా నిల‌దీస్తుంది. గ‌తంలో ఇండ‌స్ట్రీలో ఓ సెల‌బ్రెటీ మోసం చేశాడ‌ని నానా ర‌చ్చ చేసింది. ఆ ర‌చ్చ‌తో తెలుగు రాష్ట్రాల్లో శ్రీ‌రెడ్డి సెల‌బ్రెటీ అయిపోయింది. ఇక మెగా ఫ్యామిలీ గురించి అయితే శ్రీ‌రెడ్డి ఎంత‌లా రియాక్ట్ అవుత‌దో అంద‌రికీ తెలిసిందే.. మొన్న‌టికి మొన్న క‌రాటే క‌ల్యాణీ, శ్రీ‌కాంత్ రెడ్డిల ఇష్యూలో క‌రాటే క‌ల్యాణీపై ఫైర్ అయింది. కాగా పొలిటిక‌ల్ గా శ్రీ‌రెడ్డి మొద‌టి నుంచి వైపీపీకి మ‌ద్ద‌తుగా నిలుస్తోంది. త‌న‌ని ఏమైనా అంటే ఒక్కోసారి ప‌ట్టించుకోదేమో గానీ…

వైసీపీని ఏమైనా అంటే వాళ్ల అంతు చూడ‌కుండా వ‌ద‌ల‌దు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఇలా ఎవ‌రైనా స‌రే గ‌ట్టిగానే స్పందిస్తుంది. ఇక నాగ‌బాబు గురించి అయితే ఓ రేంజ్ లో ర‌చ్చ చేస్తుంది. అయితే వైసీపీకి త‌న ఫుల్ మ‌ద్ద‌తుని ఇచ్చిన‌ప్ప‌టికీ ఇంత వ‌ర‌కు ఆ పార్టీ గుర్తించ‌క‌పోవ‌డం విశేషం. అయితే ఇప్పుడు శ్రీ‌రెడ్డి ఉన్న‌ట్టుండి వైపీపీపై ఫైర్ అవుతోంది. నేను వైపీపీకి మ‌ద్ద‌తుగా మాట్లాడితే ఏదో దోచిపెడుతున్నారు అనుకోకండి.. క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేదు అంటూ అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ ఏ పార్టీ అయినా సరే.. పార్టీలతో సంబంధం లేకుండా.. కార్యకర్తల్ని దూరం చూసుకోకూడదు. ఎన్నికలు దగ్గర్లో ఉన్నాయి.. ఎలా ఉన్నా మనం అధికారంలోకి వచ్చేస్తాంలే అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది.

 sri reddy express unhappy on YSRCP over temple issue

sri reddy express unhappy on YSRCP over temple issue

రేపు 20 సీట్లు తగ్గినా.. 30 సీట్లు తగ్గినా జనంలో అసంతృప్తి పెరుగుతుందనే వాస్తవాన్ని అధికార పార్టీ గ్రహించాలి. అధికారం శాశ్వతం కాద‌నేది గ్రహించాలి. పథకాలు ఎంత బలంగా ఉన్నా.. అసంతృప్తి పెరగకుండా చూసుకోవాలి అంటూ డైరెక్ట్ గానే వైసీపీపై అస‌హంనం వ్య‌క్తం చేసింది. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే శ్రీ‌రెడ్డి త‌న సొంత గ్రామంలో శ్రీ‌వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌య నిర్మాణం చేప‌ట్టాల‌ని అనుకుంది. అప్ప‌ట్లో టీడీపీ హ‌యాంలో రిలీజ్ అయిన ఫండ్స్ తో కొంత నిర్మించ‌గా సగంలో ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఎలాగూ మ‌న ప్ర‌భుత్వ‌మే అని ఫండ్స్ కోసం ఎమ్మెల్యే, మంత్రి ఇలా ఎంత‌మంద‌ని సంప్ర‌దించినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోయింది. ఇన్నాళ్లూ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచినా క‌నీసం గుడి నిర్మాణం విష‌యంలో కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఫీల‌వుతోంది. ఇక‌నైనా దీనిపై ఎలాంటి స్పంద‌న వస్తుందో చూడాలి మ‌రి…

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది