Government Job : ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్.. ఈ రిక్రూట్ మెంట్ మీరు మిస్ అవ్వకండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Government Job : ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్.. ఈ రిక్రూట్ మెంట్ మీరు మిస్ అవ్వకండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :18 August 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Government Job : ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్.. ఈ రిక్రూట్ మెంట్ మీరు మిస్ అవ్వకండి...!

Government Job : దేశం మొత్తం నిరుద్యోగులు ఏ ప్రభుత్వ ఉద్యోగం పడుతుందా అప్లై చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసం కేవలం ఇంటర్ అర్హతతోనే ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఏకంగా స్టాఫ్ సెలక్షన్ కమీషన్ స్టెనోగ్రాఫర్ ఎక్సాం 2024 నోటిఫికేషన్ రీసెంట్ గా రిలీజైంది. ఈ రిక్రూట్మెంట్ ఎక్సాం కు సంబందించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా నేడు అంటే ఆగష్టు 17,2024 న ముగుస్తుంది. ఈ జాబ్ కి అప్లై చేయాలనుకునే అభ్యర్ధులు ఎస్.ఎస్.సీ అధికారక వెబ్ సైట్ లో అప్లై చేసుకోవచ్చు.

గ్రేడ్ సీ, గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్ ల కోసం ఎస్.ఎస్.సీ నుంచి ఏకంగా 2006 పోస్టులను భరీ చేయనున్నారు. ఆగష్టు 27 నుంచి 28 2024 వరకు అప్లై చేసిన వరు కరెక్షన్ చేసుకునే ఛాన్స్ ఉంది. అక్టోబర్ నవంబర్ లో పరీక్ష నిర్వహిస్తారు. ఎస్.ఎస్.సీ స్టెనోగ్రాఫర్ పరీక్ష జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఈ ఎగ్జాం భారత ప్రభుతం లోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో గ్రేడ్ సీ, గ్రేడ్ డీ స్థానాలకు స్టెనోగ్రాఫర్ లుగా నియమిస్తారు.

Government Job దీనికి కావాల్సిన అర్హతలు..

Government Job ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ ఈ రిక్రూట్ మెంట్ మీరు మిస్ అవ్వకండి

Government Job : ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్.. ఈ రిక్రూట్ మెంట్ మీరు మిస్ అవ్వకండి…!

స్టెనోగ్రాఫర్ కు అప్లై చేసే వారు 12వ తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి లేదా గుర్తింపు పొందిన బోర్డ్ లో తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఇక వయో పరిమితి 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.దరఖాస్తు రుసుము జనరల్, ఓబీసీ వారికి 100, ఎస్.సీ, ఎస్.టీ, పి.డబల్యు, ఎస్ సర్వీస్ మ్యాన్, మహిళా అభ్యర్ధులకు ఎలాంటి ఫీజు లేదు. ఇక ఎంపిక విధానం పూర్తిగా కంప్యూటర్ ఆధారిక పరీక్షతో ఉంటుంది. స్టెనోగ్రఫీ నైపుణ్య పరీక్ష, సీబీఈ జనరల్ అవేర్ నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇంకా ఇంగ్లీష్, కాంప్రహెషన్ విభాగాలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత ఉంటుంది. 2 గంటల పరీక్ష సమయం ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్ రెండిటిలోనూ పరీక్ష ఉంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది