SBI : నిరుద్యోగులకు గుడ్ న్యూస్… భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్బిఐ… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SBI : నిరుద్యోగులకు గుడ్ న్యూస్… భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్బిఐ…

 Authored By prabhas | The Telugu News | Updated on :14 July 2022,5:30 pm

SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఉద్యోగాలకు రెడీ అవుతున్న నిరుద్యోగులకు త్వరలో ఒక శుభవార్త చెప్పనుంది. 2022 సంవత్సరానికి సంబంధించిన క్లర్క్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎస్బిఐ ఈ నెలలో ఎప్పుడైనా సరే విడుదల చేసే అవకాశం ఉంది. అంటే మరో రెండు వారాల్లో ఈ నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. దేశంలో లక్షలాది మంది ఎస్బిఐ క్లర్క్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ వివరాల కోసం అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ sbi.co.in ను తనిఖీ చేస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే తేదీలు, పరీక్ష విధానం, అర్హతలు ఇలాంటి ముఖ్యమైన అప్ డేట్స్ ను ఎస్బిఐ క్లర్క్స్ 2022 నోటిఫికేషన్ లో పేర్కొంటారు.

క్లర్క్ రిక్రూట్మెంట్ పరీక్షను స్టేట్ బ్యాంక్ రెండు దశల్లో నిర్వహిస్తుంది. మొదటి దశలో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. రెండవది LPT పేరుతో లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఎస్బిఐ క్లర్క్స్ పరీక్ష ప్రిలిమ్స్ సిలబస్ పరీక్షల సిలబస్ మూడు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్, ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ సెక్షన్ లు ఉంటాయి. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్, ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ విభాగాల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.

State Bank of India release the job notifications

State Bank of India release the job notifications

ఎస్బిఐ క్లర్క్స్ పోస్ట్ కు విద్యా అర్హత గ్రాడ్యుయేషన్ ఏంటంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ లో ఉన్న అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్బిఐ క్లర్క్ పోస్ట్ కు కనీస వయోపరిమితి 21 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. మరోవైపు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ కూడా ఇటీవల క్లర్క్స్ 2022 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జూలై 1న ప్రారంభం అయింది. అభ్యర్థులు జూలై 21 వరకు అప్లై చేసుకోవచ్చు. దానికి అప్లై చేసేవారు IBPS అధికారిక సైట్ ibps.in ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఈ నోటిఫికేషన్ కి 6035 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది