Xiaomi 14 Civi Price | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 .. షావోమీ 14 Civi ఫోన్‌పై భారీ డిస్కౌంట్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Xiaomi 14 Civi Price | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 .. షావోమీ 14 Civi ఫోన్‌పై భారీ డిస్కౌంట్!

 Authored By sandeep | The Telugu News | Updated on :23 September 2025,9:00 pm

Xiaomi 14 Civi Price | ఈ ఫెస్టివల్ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నవారికి గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 ఇప్పటికే ప్రైమ్ యూజర్లకు ప్రారంభమైంది. ఇందులో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా షావోమీ 14 Civi (Xiaomi 14 Civi) ఫోన్‌పై భారీ తగ్గింపు అందుబాటులోకి వచ్చింది.

#image_title

షావోమీ 14 Civi ధర, ఆఫర్లు

ఇతర స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే అత్యాధునిక ఫీచర్లతో విడుదలైన Xiaomi 14 Civi ఫోన్, భారత మార్కెట్లో మొదట రూ.42,999కి లాంచ్ అయింది. అయితే, ప్రస్తుత అమెజాన్ ఫెస్టివల్ డీల్ ద్వారా ఈ ఫోన్‌ను కేవలం రూ.24,999 ధరకే పొందవచ్చు. అంటే రూ.18,000 తగ్గింపు పొందే అవకాశముంది.తద్వారా, SBI, HDFC, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులు మరియు EMI లావాదేవీలపై అదనంగా రూ.1,250 తగ్గింపు కూడా లభిస్తుంది.

అంతేకాదు, మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ ఇన్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ తగ్గింపులు పొందొచ్చు.

షావోమీ 14 Civi ఫీచర్లు & స్పెసిఫికేషన్స్:

డిస్‌ప్లే: 6.55 అంగుళాల LTPO AMOLED స్క్రీన్

రిఫ్రెష్ రేట్: 120Hz, HDR10+, డాల్బీ విజన్ స‌పోర్ట్‌

బ్రైట్నెస్: 3000 నిట్స్ పీక్స్ బ్రైట్నెస్

ప్రొటెక్షన్: కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2

ప్రాసెసర్: Qualcomm Snapdragon 8s Gen 3

బ్యాటరీ: 4700mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

ఆపరేటింగ్ సిస్టమ్: HyperOS ఆధారిత Android 14

కెమెరా సెటప్:

రేర్ కెమెరా:

50MP ప్రైమరీ (PDAF, OIS)

50MP టెలిఫోటో (2x ఆప్టికల్ జూమ్)

12MP అల్ట్రావైడ్ లెన్స్

ఫ్రంట్ కెమెరా:

32MP డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది