Bank Holidays : వరుసగా మూడో రోజు మూతపడ్డ బ్యాంకులు.. ఎందుకో తెలుసా?
ప్రధానాంశాలు:
Bank Holidays : వరుసగా మూడో రోజు మూతపడ్డ బ్యాంకులు.. ఎందుకో తెలుసా?
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు మూతపడ్డాయి. తమ దీర్ఘకాల డిమాండ్ అయిన వారానికి ఐదు రోజుల పని (5-Day Work Week) విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. జనవరి 23న చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైందని యూనియన్ నేతలు తెలిపారు. 2024 మార్చిలో కుదిరిన వేతన సవరణ ఒప్పందంలో అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించేందుకు అంగీకారం కుదిరినప్పటికీ, ప్రభుత్వం దీనిపై ఇంకా తుది నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Bank Holidays : వరుసగా మూడో రోజు మూతపడ్డ బ్యాంకులు.. ఎందుకో తెలుసా?
Bank Holidays ఏయే బ్యాంకులపై ప్రభావం?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్ వంటి సేవలకు ఆటంకం ఏర్పడనుంది. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), ఐసీఐసీఐ (ICICI) వంటి ప్రైవేట్ బ్యాంకుల్లో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
Bank Holidays వరుసగా మూడో రోజు బ్యాంకులు బంద్
జనవరి 25 (ఆదివారం), జనవరి 26 (రిపబ్లిక్ డే) సెలవుల తర్వాత ఈరోజు సమ్మె కారణంగా బ్యాంకులు మూతపడటంతో కస్టమర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే, యూపీఐ (UPI), నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయని బ్యాంకులు వెల్లడించాయి. “మేము కస్టమర్లకు వ్యతిరేకం కాదు, కానీ మెరుగైన బ్యాంకింగ్ వ్యవస్థ కోసం ఈ పోరాటం చేస్తున్నాం. సరైన విశ్రాంతి తీసుకున్న బ్యాంకర్ దేశానికి మెరుగైన సేవలు అందిస్తాడు” అని బ్యాంక్ ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు.