Street Dogs | వీధి కుక్కలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు..జంతు ప్రేమికులకు ఊరట
Street Dogs | వీధి కుక్కల సమస్యపై జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో వీధి కుక్కల బెడదను నియంత్రించడంలో భాగంగా, గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. వీధి కుక్కలను స్టెరిలైజ్ చేయడం, క్రిమిరహితం చేయడం అనంతరం తిరిగి అదే ప్రాంతాల్లో వదిలేయాలని స్పష్టంగా పేర్కొంది.
#image_title
భారీ జరిమానా..
అయితే రేబీస్ ఉన్న కుక్కలను మాత్రం షెల్టర్లకు తరలించాలని స్పష్టం చేసింది.అలాగే, వీధుల్లో కుక్కలకు బహిరంగంగా ఆహారం ఇవ్వడం అనుమతించదని తేల్చి చెప్పింది. ఆహారం అందించేందుకు ప్రత్యేక ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేయాలన్నది కీలక ఆదేశంగా నిలిచింది. కుక్కలను తీసుకెళ్లడాన్ని అడ్డుకునే వారిపై ₹25,000 నుంచి ₹2 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడాన్ని ఎవరైనా అడ్డుకుంటే, వారు నేరానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.జంతు ప్రేమికులు వీధి కుక్కలను దత్తత తీసుకోవాలంటే, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.సుప్రీం కోర్టు తన పరిధిని విస్తరించి, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పశుసంవర్ధక శాఖ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. వీధి కుక్కల సమస్యపై జాతీయ స్థాయిలో ఒక సరైన విధానం రూపొందించాల్సిన అవసరంపై వారి అభిప్రాయాలను కోరింది.