Viral Video : విద్యా బుద్దులు నేర్పాల్సిన గురువుల్లో కొంతమంది ఆ బాధ్యతను విస్మరించి నీచానికి దిగజారుతున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సింది పోయి వాళ్లతో వ్యక్తిగత సేవలు చేయించుకుంటున్నారు. గురువు అనే పదానికే మచ్చ తీసుకువస్తున్నారు. కొంతమంది టీచర్లు తమ ఇంట్లో పని కూడా స్టూడెంట్స్ తో చేయిస్తుంటారు. మరికొందరు పిచ్చిపట్టినట్లు విపరీతంగా కొడుతూ సైకోలా బిహేవ్ చేస్తుంటారు. ఇటీవల ఓ టీచర్ ఓ బలుడిని చావబాదుతూ పైశాచికానందం పొందాడు.. ఇదంతా వీడియో తీసి కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. కాగా ప్రస్తుతం ఓ లేడీ టీచరమ్మ స్టూడెంట్ తో చేతులు నొక్కించుకుంది. పాఠాలు చెప్పమంటే పట్లు ఎలా పట్టాలో నేర్పిస్తోంది.
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని హర్దోయి ప్రైమరీ స్కూల్ లో జరిగింది. ఈ స్కూల్ లో ఊర్మిళ సింగ్ టీచర్ గా పనిచేస్తోంది. అయితే ఈ టీచరమ్మ పిల్లలకు పాఠాలు చెప్పాల్సింది పోయి వారితో మసాజ్ చేయించుకుంటోంది. అందులో ఆ బాలుడు టీచరమ్మ చేయి నొక్కుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బాలుడు ఆమె చేతికి మసాజ్ చేస్తున్న దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియా లో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో అధికారులు ఆ టీచర్ పై చర్యలు తీసుకున్నారు.
సస్పెండ్ చేయడమే కాకుండా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అయితే ఆ టీచరమ్మ తరగతులకు వెళ్లదని.. పాఠాలు కూడా సరిగ్గా చెప్పదని స్కూల్ హెడ్ మాస్టర్ తెలిపారు. పిల్లలకు మంచి చెడులు బేధాలు తెలియజేసి సమాజంలో ఎలా మెలగాలో నేర్పించాల్సిన వాళ్లే ఇలా ప్రవర్తిస్తే పిల్లలు మీ నుంచి ఏం నేర్చుకుటారని ప్రశ్నిస్తున్నారు. గురువే ప్రత్యక్ష దైవం అని భావించే ఈ సమాజంలో.. అంతటి ఉన్నతమైన వృత్తిలో ఉంటూ మచ్చ తీసుకువస్తున్నారు. కాగా ఈ టీచరమ్మ చేసిన పనికి నెటిజన్లు ఫైర అవుతున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయండి..
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.