Payasam Recipe : చెరుకు రసంతో ఎంతో రుచికరమైన పాయసం చేసుకోండి ఇలా…
Payasam Recipe : సాధారణంగా చెరుకురాసాన్ని త్రాగుతూ ఉంటారు. అలాగే చెరుకు గడలను తెచ్చుకుని తింటూ ఉంటారు. ఇలా రసాన్ని త్రాగడం వలన మనం తీసుకున్న మంచిగా డైజేషన్ అవుతుంది. అలాగే చెరుకులు గడలు రసం తాగడం వలన చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ జలుబులు డబ్బులు ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే శరీరంలో ఉండే జీర్ణ వ్యవస్థ పనితీరు పెరుగుతుంది. అలాగే ఈ చెరుకు గడలతో ఫ్యాక్టరీల్లో పంచదార, బెల్లం తయారు చేస్తారు.
ఇలాంటి చెరుకుగడ రసంతో మనం ఇప్పుడు ఎంతో రుచికరమైన పాయసం రెడీ చేసుకుందాం.. దీనికి కావాల్సిన పదార్థాలు: 1) రెండు గ్లాసుల చెరుకు రసం 2) ఒక కప్పు బియ్యం 3) ఒక గ్లాస్ పాలు 4) నెయ్యి 5)జీడిపప్పులు 6)కిస్ మిస్ లు 7)యాలకులు 8) కొబ్బరి ముక్కలు మొదలగునవి. తయారు చేసే విధానం: ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఓ బాండీ పెట్టి దానిలో రెండు స్పూన్ల నెయ్యిని వేసి జీడిపప్పులు, కిస్ మిస్ లను వేయించుకోని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో ఒక గ్లాస్ పాలు రెండు గ్లాసుల చెరుకు రసాన్ని పోసి వేడి చేసుకోవాలి.
తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేయాలి. వేసిన తర్వాత మంచిగా మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి ఉంచాలి. తర్వాత దీంట్లో కొంచెం ఇలాచి పొడి, తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్ మిస్ లను వేయాలి. తర్వాత సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలను వేసి స్టవ్ మీద నుంచి దింపాలి. తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చేరుకు రసం పాయసం రెడీ. ఇలాంటి పాయసాలు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది.