Payasam Recipe : ఒక్కసారైనా ఇలా ఖీర్ పూరి ట్రై చేయండి తిన్నాక మీకే ఫేవరెట్ అయిపోతుంది…!!
Payasam Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి ఖీర్ పూరి. ఇంట్లో ఏదైనా స్పెషల్ స్వీట్ తయారు చేయాలన్న లేదన్న కొత్తగా ట్రై చేయాలన్న ఇలా ఖీర్ అండ్ పూరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి ట్రై చేశారంటే ఇక మీరు ఫ్యాన్ అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే ఇక బాగా నచ్చుతుంది. కావున దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : బియ్యం, బాదంపప్పు, జీడిపప్పు, గోధుమపిండి, పంచదార, కుంకుమపువ్వు, యాలకుల పొడి, డ్రైఫ్రూట్స్, ఆయిల్, బటర్, ఆయిల్, పంచదార మొదలైనవి.. దీని తయారీ విధానం : ముందుగా ఒక గ్లాసు బియ్యంని తీసుకొని శుభ్రంగా కడిగి దానిలో బాదంపప్పులు, జీడిపప్పులు నాలుగు నాలుగు వేసి ఒక గంటపాటు నానబెట్టుకోవాలి. తర్వాత పూరి కోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుని దానిలో నెయ్యిని
వేసి కొంచెం ఉప్పుని వేసి బాగా రబ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మెత్తగా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక తర్వాత ఒక కడాయిని తీసుకొని కొన్ని నీళ్లు వేసి తర్వాత ఒక లీటర్ పాలను వేసుకోవాలి. దీనిని స్టవ్ పైన పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇవి మరిగే లోపు మన ముందుగా నానబెట్టుకున్న బియ్యం బాదం పప్పు జీడిపప్పుల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా కాకుండా బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పాలు మరుగుతున్నప్పుడు గరిట తీసుకొని బాగా కలుపుకోవాలి. మరో 10 నిమిషాల పాటు కాకినాడ కాగుతున్న పాలల్లో ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం మిశ్రమాన్ని దాన్లో వేసి గరిటతో కలుపుకుంటూ ఉండాలి. ఈ కీర్ అనేది ఎల్లో కలర్ లో రావడం కోసం కొంచెం కుంకుమ పువ్వుని దానిలో వేసి బాగా కలుపుకోవాలి.
తర్వాత డ్రై ఫ్రూట్స్ ని సన్నగా తురుముకొని దానిలో వేసుకోవాలి. తర్వాత ఒక అర కప్పు పంచదారను వేసి మరల బాగా కలుపుకోవాలి. చక్కెర వేసిన తర్వాత కొంచెం చిక్కపడే వరకు ఉడికించుకొని దానిలో కొంచెం యాలుకల పొడి కూడా వేసి తీసి ఒక బౌల్లో పోసుకోవాలి.తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమపిండి మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని పూరీల్లా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని ఆ ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇక ఒకొక్క పూరిని దానిలో వేసి రెండు వైపులా మంచిగా కాల్చి తీసుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా పూరి అండ్ కీర్ కాంబినేషన్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక్కసారి తిన్నారంటే దీనికి ఇక ఫేవరెట్ అవ్వాల్సిందే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.