Bikes : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ బైక్ నిత్యవసరం అయిపోయింది. అడుగు తీసి బయటపెడితే బైక్ ఎక్కాల్సిందే.. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు.. ఉద్యోగస్తులకు.. బైక్ తప్పనిసరి. ప్రస్తుతం ఒక్కో ఇంట్లో ఒకటి లేదా రెండు బైక్ లు తప్పనిసరిగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో అత్యధికంగాబైకులు వాడుతున్న దేశంగా ఇండియా మొదటి స్థానంలో ఉంది. ముఖ్యంగా హోండా, హీరో, బజాజ్, యమహ, టీవీఎస్ లాంటి కంపెనీలతోపాటు బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ బైక్‌లో మార్కెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఎక్కువ మైలేజీ, స్మార్ట్ ఫీచర్లతో లభించే ట్రెండీ లుక్స్‌తో సరసమైన ధరలో లభించే బైక్స్‌పై కొనుగోలుదారులు ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అయితే 2022 సంవత్సరంలో టూ వీలర్స్ ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రూ.లక్షలోపు మైలేజీ, లుక్ పరంగా ఆకట్టుకునే బైకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
ఈ సెగ్మెంట్‌లో చాలా పాపులర్ అయిన బైక్ హోండా షైన్ కూడా. దీని ధర ధర రూ.77,338 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. 124 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో పని చేస్తుంది. 10 బీఎచ్పీ, 11 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 6 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అలాగే.. బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా వచ్చిన హోండా తొలి బైక్ హోండా ఎస్పీ 125. ఈ బైక్ రెండు వేరియంట్లలో, 5 కలర్స్‌లో లభిస్తోంది. ప్రారంభ ధర రూ. 82,243 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో కూడిన బీఎస్6 కంప్లైంట్ 125 సీసీ ఇంజన్‌తో10.5బీఎచ్పీ గరిష్ట శక్తిని 10.3ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
హీరో సంస్థకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో హీరో గ్లామర్ ఒకటి. హీరో గ్లామర్ 12 వేరియంట్‌లు, 13 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. 124.7సీసీ ఇంజన్‌తో ఈ బైక్ పని చేస్తుంది. ఇది 10.72 బీఎచ్పీ శక్తిని, 10.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బీఎస్-6 కంప్లైంట్ మోడల్‌తో చిన్న మార్పులతో మేక్ఓవర్ అయిన ఈ బైక్ ప్రారంభ ధర రూ.78,753 గా ఉంది. అలాగే హీరో ఐకానిక్ బైక్ స్ప్లెండర్ ప్రీమియం వెర్షన్ హీరో సూపర్ స్ప్లెండర్. ఇది 124.7సీసీ ఇంజన్ 10.72 బీఎచ్పీ, 10.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 77,939 గా ఉంది.
బజాజ్ పల్సర్ 125 బైక్ ప్రారంభ ధర రూ. 82,712 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. 4 వేరియంట్‌లు 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ బైక్‌లోని 124.4 సీసీ, ఎయిర్-కూల్డ్, డీటీఎస్ఐ ఇంజన్‌తో 1.64 బీఎచ్పీ, 10.8 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే మరో బైక్ టీవీఎస్ రైడర్ 125. ఇది 124.8 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, త్రీ-వాల్వ్ ఇంజన్‌తో 11.2 బీఎచ్పీ శక్తిని , 11.2 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 4 కలర్స్, 3 వేరియంట్‌లలో లభిస్తోంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.88,078 (ఎక్స్-షోరూమ్) గా ఉంది.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.