Bikes : లక్ష రూపాయల లోపు లభించే సూపర్‌బైక్స్‌ ఇవే.. అదిరిపోయే ఫీచ‌ర్స్ తో.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bikes : లక్ష రూపాయల లోపు లభించే సూపర్‌బైక్స్‌ ఇవే.. అదిరిపోయే ఫీచ‌ర్స్ తో..

 Authored By aruna | The Telugu News | Updated on :29 July 2022,10:00 pm

Bikes : ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రికీ బైక్ నిత్య‌వ‌స‌రం అయిపోయింది. అడుగు తీసి బ‌య‌ట‌పెడితే బైక్ ఎక్కాల్సిందే.. ముఖ్యంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు.. ఉద్యోగ‌స్తుల‌కు.. బైక్ త‌ప్ప‌నిస‌రి. ప్ర‌స్తుతం ఒక్కో ఇంట్లో ఒక‌టి లేదా రెండు బైక్ లు త‌ప్ప‌నిస‌రిగా ఉంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌పంచంలో అత్య‌ధికంగాబైకులు వాడుతున్న దేశంగా ఇండియా మొద‌టి స్థానంలో ఉంది. ముఖ్యంగా హోండా, హీరో, బజాజ్‌, య‌మ‌హ‌, టీవీఎస్‌ లాంటి కంపెనీలతోపాటు బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ బైక్‌లో మార్కెట్‌లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. అయితే ఎక్కువ మైలేజీ, స్మార్ట్‌ ఫీచర్ల‌తో లభించే ట్రెండీ లుక్స్‌తో సరసమైన ధరలో లభించే బైక్స్‌పై కొనుగోలుదారులు ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అయితే 2022 సంవ‌త్స‌రంలో టూ వీల‌ర్స్ ధ‌ర‌లు పెరిగాయి. ఈ నేప‌థ్యంలో రూ.ల‌క్ష‌లోపు మైలేజీ, లుక్ ప‌రంగా ఆక‌ట్టుకునే బైకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

Bikes : హోండా షైన్.. హోండా ఎస్పీ 125

ఈ సెగ్మెంట్‌లో చాలా పాపులర్ అయిన‌ బైక్ హోండా షైన్ కూడా. దీని ధ‌ర ధర రూ.77,338 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. 124 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో పని చేస్తుంది. 10 బీఎచ్పీ, 11 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 6 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అలాగే.. బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా వచ్చిన హోండా తొలి బైక్‌ హోండా ఎస్పీ 125. ఈ బైక్‌ రెండు వేరియంట్లలో, 5 కలర్స్‌లో లభిస్తోంది. ప్రారంభ ధర రూ. 82,243 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో కూడిన బీఎస్6 కంప్లైంట్ 125 సీసీ ఇంజన్‌తో10.5బీఎచ్పీ గరిష్ట శక్తిని 10.3ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Super Bikes at low prices

Super Bikes at low prices

Bikes : హీరో గ్లామ‌ర్.. హీరో సూపర్ స్ప్లెండర్

హీరో సంస్థ‌కు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో హీరో గ్లామర్ ఒకటి. హీరో గ్లామర్ 12 వేరియంట్‌లు, 13 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి. 124.7సీసీ ఇంజన్‌తో ఈ బైక్ పని చేస్తుంది. ఇది 10.72 బీఎచ్పీ శక్తిని, 10.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బీఎస్‌-6 కంప్లైంట్ మోడల్‌తో చిన్న మార్పులతో మేక్ఓవర్‌ అయిన ఈ బైక్‌ ప్రారంభ ధర రూ.78,753 గా ఉంది. అలాగే హీరో ఐకానిక్‌ బైక్‌ స్ప్లెండర్ ప్రీమియం వెర్షన్ హీరో సూపర్ స్ప్లెండర్. ఇది 124.7సీసీ ఇంజన్‌ 10.72 బీఎచ్పీ, 10.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 77,939 గా ఉంది.

Bikes : బజాజ్ పల్సర్ 125.. టీవీఎస్‌ రైడర్ 125

బజాజ్ పల్సర్ 125 బైక్ ప్రారంభ ధ‌ర‌ రూ. 82,712 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. 4 వేరియంట్‌లు 3 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ బైక్‌లోని 124.4 సీసీ, ఎయిర్-కూల్డ్, డీటీఎస్ఐ ఇంజన్‌తో 1.64 బీఎచ్పీ, 10.8 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే మ‌రో బైక్ టీవీఎస్‌ రైడర్ 125. ఇది 124.8 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, త్రీ-వాల్వ్ ఇంజన్‌తో 11.2 బీఎచ్పీ శక్తిని , 11.2 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 4 కలర్స్‌, 3 వేరియంట్‌లలో ల‌భిస్తోంది. ఈ బైక్‌ ప్రారంభ ధర రూ.88,078 (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది