Narendra Modi : సుప్రీం కొట్టిన దెబ్బతో విలవిలలాడుతోన్న నరేంద్ర మోదీ..!
Narendra Modi : సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీకే సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అవును.. అసలు తనకు ఈ స్థాయిలో సుప్రీం నుంచి షాక్ తగులుతుందని మోదీ ఊహించి ఉండరు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీబీసీ డాక్యుమెంటరీపై రచ్చ నడుస్తోంది కదా. అది గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్లకు సంబంధించిన డాక్యుమెంటరీ. గోద్రా అల్లర్లు జరిగినప్పుడు మోదీ సీఎంగా ఉన్నారు. అప్పట్లో ఈ గొడవలు జరిగి వేల మంది చనిపోవడానికి కారణం
బీజేపీ పార్టీయే అని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆ ఘటన జరిగింది కూడా ఇప్పుడు కాదు. 25 ఏళ్లు అవుతోంది. దానికి సంబంధించి ఒక డాక్యుమెంటరీని ఇటీవల బీబీసీ తీసింది. ఆ డాక్యుమెంటరీని మత కలహాలు సృష్టించేలా ఉందని కేంద్రం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అప్పటికే ఆ డాక్యుమెంటరీని చాలామంది చూసేశారు. ముఖ్యంగా దేశంలోని పలు యూనివర్సిటీలలో ఈ డాక్యుమెంటరీ రచ్చ చేసింది. ఢిల్లీ యూనివర్సిటీలో అల్లర్లు చోటు చేసుకున్నాయి.
Narendra Modi : సుప్రీంకోర్టులో వివాదాస్పద డాక్యుమెంటరీపై విచారణ
సుప్రీంకోర్టులో వివాదాస్పద డాక్యుమెంటరీపై విచారణ కూడా జరిగింది. అసలు ఈ డాక్యుమెంటరీని ఎందుకు బ్యాన్ చేయాలి. బీబీసీ చానెల్ ను ఎందుకు బ్యాన్ చేయాలి అని సుప్రీం కేంద్రాన్ని ప్రశ్నించింది. బీబీసీ చానెల్ ను దేశంలో నిషేధించాలని పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. డాక్యుమెంటరీ ఒరిజినల్ రికార్డులను కోర్టుకు సమర్పించాలని, చానెల్, డాక్యుమెంటరీని నిషేధించాల్సిన అవసరం లేదని కేంద్రానికి షాకిచ్చింది సుప్రీం. ఒకవేళ ఆ డాక్యుమెంటరీని మళ్లీ దేశంలో ప్రదర్శిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తిప్పలు తప్పవేమో.