India Us Tariffs : భారత్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన ట్రంప్‌ .. సుంకాలపై కీలక నిర్ణయం

 Authored By suma | The Telugu News | Updated on :3 February 2026,8:45 am

ప్రధానాంశాలు:

  •  India Us Tariffs : భారత్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన ట్రంప్‌ .. సుంకాలపై కీలక నిర్ణయం

India Us Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  Donald Trump  భారత్‌పై విధించిన ప్రతీకార టారిఫ్‌ల  India tariffs విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు 25 శాతంగా ఉన్న టారిఫ్‌లను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో  Truth Social  పోస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ కాల్ ద్వారా చర్చలు ముగిసిన వెంటనే ఈ ప్రకటన వెలువడడం రాజకీయంగా, ఆర్థికంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో ఇది కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

We are reducing tariffs on India to 18 percent..Trump

India Us Tariffs : భారత్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన ట్రంప్‌ .. సుంకాలపై కీలక నిర్ణయం

India Us Tariffs : మోదీతో ఫోన్ కాల్‌లో కీలక చర్చలు

ట్రంప్ తన పోస్టులో ప్రధాని నరేంద్ర మోదీతో  Narendra Modi  జరిగిన ఫోన్ సంభాషణను ప్రస్తావించారు. మోదీని తన సన్నిహిత మిత్రుల్లో ఒకరిగా పేర్కొన్న ఆయన భారత్‌లో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ప్రశంసించారు. ఫోన్ కాల్‌లో వాణిజ్యం మాత్రమే కాకుండా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ ఇంధన సరఫరా వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి మోదీ అంగీకరించారని ట్రంప్ వెల్లడించారు. అదే సమయంలో అమెరికా నుంచి అలాగే వెనెజువెలా నుంచి ఎక్కువ మొత్తంలో చమురు కొనుగోలు చేసేందుకు భారత్ ఆసక్తి చూపిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకడంలో సహాయపడతాయని ప్రతివారం వేల మంది ప్రాణాలు కోల్పోతున్న ఆ యుద్ధానికి ఇది చరమగీతం పాడే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

India Us Tariffs : కొత్త వాణిజ్య ఒప్పందం .. 500 బిలియన్ డాలర్ల లక్ష్యం

మోదీ చేసిన విజ్ఞప్తి మేరకు అమెరికా–భారత్ మధ్య కొత్త వాణిజ్య ఒప్పందానికి  trade agreement  ఆమోదం తెలిపినట్లు ట్రంప్ తెలిపారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని దాని ప్రకారం ఇప్పటివరకు అమల్లో ఉన్న 25 శాతం టారిఫ్‌లు 18 శాతానికి తగ్గుతాయని స్పష్టం చేశారు. అదే సమయంలో భారత్ కూడా తన వైపు నుంచి టారిఫ్‌లను తగ్గిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో పూర్తిస్థాయి పన్ను రహిత వాణిజ్యానికి ద్వారాలు తెరుచుకునే అవకాశముందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా తయారీ వస్తువుల కొనుగోలుపై భారత్ కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వాణిజ్య పరిమాణం దాదాపు 500 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని తెలిపారు. ఇందులో ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయం, బొగ్గు తదితర కీలక రంగాల ఉత్పత్తులు ఉంటాయని వివరించారు. ఈ ఒప్పందంతో భారత్–అమెరికా సంబంధాలు మరింత దృఢంగా మారతాయని రెండు దేశాల భాగస్వామ్యం కొత్త ఎత్తులకు చేరుకుంటుందని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.

India Us Tariffs : ట్రంప్‌నకు 140 కోట్ల మంది తరఫున కృతజ్ఞతలు

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తాజా ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ  PM Narendra Modi స్పందించారు. భారత ఉత్పత్తులపై ఇకపై కేవలం 18 శాతం సుంకమే అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈ నిర్ణయం భారత్‌కు ఎంతో ప్రయోజనకరమని మోదీ పేర్కొన్నారు. ఎక్స్‌ వేదికగా స్పందించిన ఆయన ఈ ప్రకటన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిసి పనిచేస్తే ప్రపంచానికి మేలు జరుగుతుందని అన్నారు. కాగా మోదీ, ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడుకున్నారని అమెరికాలో భారత రాయబారి సెర్గియో గోర్‌ వెల్లడించారు. జైశంకర్‌ అమెరికా పర్యటన వేళ ఈ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది.

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి