Supreme Court : సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఒకే రాష్ట్రానికే..!
Supreme Court : ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్‌కు సంబంధించి సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన ఓ వ్యక్తి.. రిజర్వేషన్ కు తన సొంత రాష్ట్రంలో తప్పితే మరే రాష్ట్రంలో కూడా అర్హుడు కాదని తేల్చి చెప్పింది.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఓ వ్యక్తికి తన సొంత రాష్ట్రంలోని కేటాయించబడిన అన్ని రిజర్వేషన్లు వర్తిస్తాయంటూ.. అయితే అతను వేరే రాష్ట్రానికి వలస వెళ్లినప్పుడు మాత్రం ఈ రిజర్వేషన్లు వర్తించవని స్పష్టం చేసింది.
జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిస్తూ ఇందుకు సంంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్‌కు చెందిన ఎస్సీ వర్గానికి చెందిన భదర్ రామ్ అనే వ్యక్తి… రాజస్థాన్‌లో రిజర్వేషన్ కింద భూమి పొందడానికి వేసిన పిటిషన్ ను కొట్టి వేస్తూ ఈ మేరకు అందుకు వీల్లేదని కోర్టు తెలిపింది. సదరు పిటిషన్ దారుడికి కేటాయించిన ఆ స్థలాన్ని…
ఆయనకు బదులుగా రాజస్థాన్ కు చెందిన మరో లబ్ధిదారుడికి ఇవ్వాలని సూచించింది. ఎస్సీ ఎస్టీల వర్గానికి చెందిన వారికి వారి వారి సొంత రాష్ట్రాల్లోని.. విద్య, ఉద్యోగ, భూ కేటాయింపుల రిజర్వేషన్ కు అర్హులైనంత మాత్రాన.. అన్ని రాష్ట్రాల్లోనూ వారు అర్హులు కాదన్న విషయం మరోసారి గుర్తు చేస్తున్నట్లు న్యాయాధికారులు పేర్కొన్నారు.