Telangana Early Elections : తెలంగాణలో 2018 సీన్ రిపీట్.. మళ్లీ ముందస్తు ఎన్నికలు.. సర్వే రిపోర్టులు ఏమంటున్నాయంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana Early Elections : తెలంగాణలో 2018 సీన్ రిపీట్.. మళ్లీ ముందస్తు ఎన్నికలు.. సర్వే రిపోర్టులు ఏమంటున్నాయంటే?

 Authored By kranthi | The Telugu News | Updated on :15 December 2022,2:00 pm

Telangana Early Elections : 2014 లో తొలిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ,TRS party. దీంతో ముఖ్యమంత్రి,Chief Minister,గా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు కేసీఆర్,KCR. ఆ తర్వాత నాలుగేళ్లకే అంటే 2018 లోనే ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చారు. 2019 లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. కావాలని ముందే అసెంబ్లీని డిసాల్వ్ చేసి 2018 లోనే అసెంబ్లీ ఎన్నికలను జరపడంతో మరోసారి ఎన్నికల్లో గెలిచారు కేసీఆర్. మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. లెక్క ప్రకారం మళ్లీ ఎన్నికలు 2023 లో జరగాలి. కానీ.. రెండో సారి కూడా తెలంగాణ,Telangana,లో ముందస్తు ఎన్నికలను తీసుకురానున్నారు అనే వార్తలు ప్రస్తుతం తెలంగాణలో హల్ చల్ చేస్తున్నాయి.

దీంతో వెంటనే పలు రాజకీయ పార్టీలు, Political parties, వెంటనే తమ పార్టీ పరిస్థితి ఏంటి..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో గెలుస్తామా? లేదా? అనేది తెలుసుకోవడం కోసం సర్వేలు నిర్వహించుకుంటున్నాయి. ఇప్పటికే మునుగోడు,Munugōḍuలో ఏం జరిగిందో అన్ని పార్టీలకు అర్థం అయ్యాయి. మునుగోడును ఒక గుణపాఠంగా తీసుకొని ముందుకెళ్తున్నాయి. ముందస్తు కోసం ముందే 119 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ,TRS party, కూడా సర్వేలు చేయిస్తోంది. కాకపోతే మెజారిటీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందని ప్రశాంత్ కిషోర్ టీం,Prashanth Kishore team నిర్వహించిన సర్వేలోనూ వెల్లడైంది. టీఆర్ఎస్ పార్టీ సొంత సర్వేలోనూ అదే విషయం బయటపడింది. ఇప్పటికే సిట్టింగ్స్ అందరికీ టికెట్ అని సీఎం కేసీఆర్ ముందే ప్రకటించారు.

survey reports in telangana says about early elections in telangana

survey reports in telangana says about early elections in telangana

Telangana Early Elections : సిట్టింగ్స్ అందరికీ టికెట్ ఇవ్వను అని ముందే చెబితే మొదటికే మోసం వస్తుందని కేసీఆర్ గ్రహించారా?

ఈ సర్వే తర్వాత కొందరు సిట్టింగ్స్ కు టికెట్ ఇవ్వకపోతే అది మొదటికే మోసం వస్తుందని కేసీఆర్ ముందే గ్రహించి.. దానిపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు, Congress, BJP parties, కూడా ముందస్తు వస్తే ఎలా ఎదుర్కోవాలో ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. అసలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారా? కాంగ్రెస్ లో అటూ ఇటుగా ఉన్నా.. బీజేపీలో అయితే లేరనే చెప్పుకోవాలి. ఏదో రెండు మూడు ఉపఎన్నికల్లో గెలిచినంత మాత్రాన.. 119 నియోజకవర్గాల్లో బీజేపీ, BJPకి గెలిచే సత్తా ఉందా అనేది మాత్రం పెద్ద డౌటే అని చెప్పుకోవాలి. చూద్దాం మరి ఒకవేళ ముందస్తు ఎన్నికలు,Early elections వస్తే అన్ని పార్టీలు ఎలా సమాయత్తం అవుతాయో?

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది