#image_title
Solar Eclipse | ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం ఆదివారం రాత్రి 10:59 గంటలకు ప్రారంభమై, సోమవారం తెల్లవారుజామున 3:23 గంటలకు ముగిసింది. ఈ గ్రహణం మొత్తం 4 గంటలు 24 నిమిషాల పాటు కొనసాగింది. ఇది పాక్షిక సూర్యగ్రహణం కావడంతో, చంద్రుడు సూర్యుని ముందు కొంత భాగాన్ని మాత్రమే కప్పేయడం జరిగింది.
#image_title
మళ్లీ ఎప్పుడు అంటే..
ఈ గ్రహణం భారతదేశంలో కనిపించలేదు. అయితే ఫిజీ, ఆస్ట్రేలియా, దక్షిణ న్యూజిలాండ్, అంటార్కిటికా వంటి దేశాల్లో ఇది కనిపించింది. న్యూజిలాండ్‌లో సూర్యుడి దాదాపు 80 శాతం భాగం చంద్రుడు కప్పేసినట్టు రిపోర్టులు వచ్చాయి. అందుకే అక్కడి ప్రజలకు ఇది ఒక అరుదైన ఖగోళ దృశ్యంగా నిలిచింది. గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేని ప్రజలు, నాసా మరియు ఇతర అంతరిక్ష సంస్థల ప్రత్యక్ష ప్రసారాల ద్వారా దీన్ని చూసేందుకు ఆసక్తి కనబరిచారు.
జ్యోతిష శాస్త్ర నివేదికల ప్రకారం, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 17, 2026 మంగళవారం వార్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే అది కూడా భారతదేశంలో కనిపించదు. దాని దర్శనం జింబాబ్వే, దక్షిణాఫ్రికా, జాంబియా, మారిషస్, అంటార్కిటికా, దక్షిణ అమెరికా వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో, చంద్రుడు సరిగ్గా భూమి – సూర్యుని మధ్య వస్తే, సూర్యునిపై చాయ వెలువడుతుంది. దీనినే సూర్యగ్రహణం అంటారు.
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
This website uses cookies.