Solar Eclipse | ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం ముగిసింది .. మరి 2026లో ఎప్పుడు వస్తుంది?
Solar Eclipse | ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం ఆదివారం రాత్రి 10:59 గంటలకు ప్రారంభమై, సోమవారం తెల్లవారుజామున 3:23 గంటలకు ముగిసింది. ఈ గ్రహణం మొత్తం 4 గంటలు 24 నిమిషాల పాటు కొనసాగింది. ఇది పాక్షిక సూర్యగ్రహణం కావడంతో, చంద్రుడు సూర్యుని ముందు కొంత భాగాన్ని మాత్రమే కప్పేయడం జరిగింది.

#image_title
మళ్లీ ఎప్పుడు అంటే..
ఈ గ్రహణం భారతదేశంలో కనిపించలేదు. అయితే ఫిజీ, ఆస్ట్రేలియా, దక్షిణ న్యూజిలాండ్, అంటార్కిటికా వంటి దేశాల్లో ఇది కనిపించింది. న్యూజిలాండ్‌లో సూర్యుడి దాదాపు 80 శాతం భాగం చంద్రుడు కప్పేసినట్టు రిపోర్టులు వచ్చాయి. అందుకే అక్కడి ప్రజలకు ఇది ఒక అరుదైన ఖగోళ దృశ్యంగా నిలిచింది. గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేని ప్రజలు, నాసా మరియు ఇతర అంతరిక్ష సంస్థల ప్రత్యక్ష ప్రసారాల ద్వారా దీన్ని చూసేందుకు ఆసక్తి కనబరిచారు.
జ్యోతిష శాస్త్ర నివేదికల ప్రకారం, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 17, 2026 మంగళవారం వార్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే అది కూడా భారతదేశంలో కనిపించదు. దాని దర్శనం జింబాబ్వే, దక్షిణాఫ్రికా, జాంబియా, మారిషస్, అంటార్కిటికా, దక్షిణ అమెరికా వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో, చంద్రుడు సరిగ్గా భూమి – సూర్యుని మధ్య వస్తే, సూర్యునిపై చాయ వెలువడుతుంది. దీనినే సూర్యగ్రహణం అంటారు.