Suryakumar Yadav : హార్ధిక్ పాండ్యాకి కాదు కెప్టెన్సీ.. అత‌డిని రంగంలోకి దింపేలా గౌత‌మ్ గంభీర్ ప్లాన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Suryakumar Yadav : హార్ధిక్ పాండ్యాకి కాదు కెప్టెన్సీ.. అత‌డిని రంగంలోకి దింపేలా గౌత‌మ్ గంభీర్ ప్లాన్

 Authored By ramu | The Telugu News | Updated on :17 July 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Suryakumar Yadav : హార్ధిక్ పాండ్యాకి కాదు కెప్టెన్సీ.. అత‌డిని రంగంలోకి దింపేలా గౌత‌మ్ గంభీర్ ప్లాన్

Suryakumar Yadav : టీమిండియాకి కొత్త హెడ్ కోచ్ వ‌చ్చాడు. ఇక టీంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.టీ20 వరల్డ్ కప్-2026ని దృష్టిలో పెట్టుకుని నయా కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్టర్లు కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేసేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌‌ను భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లకు గుడ్‌బై చెప్పాడు. అయితే ఇప్పుడు కెప్టెన్‌గా ఎవ‌రిని ఎంపిక చేస్తార‌నే చ‌ర్చ న‌డుస్తుంది. శ్రీలంక పర్యటనకు ఫస్ట్ ఛాయిస్ ఆటగాళ్లతో కూడిన జట్టు పంపించే అవకాశం ఉంది.

Suryakumar Yadav సూర్య‌కి కెప్టెన్సీ..

ముఖ్యంగా గౌతమ్ గంభీర్.. సీనియర్ ఆటగాళ్లంతా అందుబాటులో ఉండాలని సెలెక్టర్లను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకగా.. హార్దిక్ పాండ్యా సారథిగా జట్టును నడిపిస్తాడని అంతా భావించారు. కానీ గౌతమ్ గంభీర్.. సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా‌కు ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తకుండా.. వర్క్‌లోడ్ మేనేజ్‌ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2026 టీ20 ప్రపంచకప్ వరకు సూర్యనే కెప్టెన్‌గా కొనసాగించాలని గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా ఆటగాడిగానే జట్టులో కొనసాగనున్నాడు.

Suryakumar Yadav హార్ధిక్ పాండ్యాకి కాదు కెప్టెన్సీ అత‌డిని రంగంలోకి దింపేలా గౌత‌మ్ గంభీర్ ప్లాన్

Suryakumar Yadav : హార్ధిక్ పాండ్యాకి కాదు కెప్టెన్సీ.. అత‌డిని రంగంలోకి దింపేలా గౌత‌మ్ గంభీర్ ప్లాన్

బుమ్రా మాత్రం కెప్టెన్సీ విషయంలో సూర్యకు గట్టి పోటీ ఇచ్చాడు. వన్డే వరల్డ్ కప్ ముందు ఐర్లాండ్‌తో సిరీస్‌కు భారత జట్టును బుమ్రా నడిపించాడు కూడా. కానీ పనిభారంతో పాటు కెప్టెన్సీ ఒత్తిడి బుమ్రాపై తీసుకురావద్దని బీసీసీఐ సూర్యను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక సూర్య గత కొన్నేళ్లుగా టీ20 బ్యాటర్లలో టాప్-2లోపే కొనసాగుతున్నాడు. టీ20ల్లో టీమిండియా బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలుస్తున్నాడు. దీంతో సూర్యను ఎంపిక చేయాలని చూస్తోంది.ఈ నెలాఖరులో టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా శ్రీలంకతో టీమిండియా మూడు టీ20లతో పాటు మూడు వన్డేలు ఆడనుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది