Nepal | నేపాల్‌కు తొలి మహిళా ప్రధానిగా సుశీల.. అవినీతిని అస్సలు సహించని వ్యక్తిగా గుర్తింపు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nepal | నేపాల్‌కు తొలి మహిళా ప్రధానిగా సుశీల.. అవినీతిని అస్సలు సహించని వ్యక్తిగా గుర్తింపు

 Authored By sandeep | The Telugu News | Updated on :13 September 2025,7:00 pm

Nepal |  నేపాల్‌ చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆ దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ శుక్రవారం తాత్కాలిక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్‌ రాజకీయ పరిణామాల మధ్య, ప్రజాస్వామ్య పునరుద్ధాన లక్ష్యంగా ఆమెను తాత్కాలిక ప్రధానిగా నియమించటం విశేషం.

#image_title

ప్ర‌త్యేక గుర్తింపు

ప్రస్తుతం నేపాల్‌కు తొలి మహిళా ప్రధానిగా సుశీల చరిత్ర సృష్టించారు. గతంలోనూ దేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా తన సేవల్ని అందించిన ఆమె, ఇక పాలనాధికార బాధ్యతలకూ అడుగుపెట్టారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ పునరుద్ధరించే దిశగా కార్యాచరణ మొదలుపెట్టారు.

తాత్కాలిక ప్రభుత్వంగా ఆమె నేతృత్వంలోని కేబినెట్ తొలి నిర్ణయం – 2026 మార్చి 4న పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వం ఏర్పరచడం. ఈ నిర్ణయంతో ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా మైలురాయి వేయబోతోంది.1975లో ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ, ఆ తర్వాత స్వదేశానికి వెళ్లి న్యాయవిద్య పూర్తి చేసి న్యాయవాదిగా సేవలందించారు. సుశీలకు ప్రజల్లో విశేష గౌరవం కలిగింది, ముఖ్యంగా అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆమె స్పష్టమైన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.2017లో ఆమె పోలీసు నియామకాల్లో రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. 2022లో సీజేఐగా పదవీ విరమణ చేశారు.

Also read

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది