RDO | పుట్టపర్తి ఆర్డీవో సువర్ణపై వీఆర్వోలు ఫిర్యాదు .. గుంజీలు తీయించిన ఘటన కలకలం
RDO | శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ వ్యవహారం పెద్ద వివాదానికి దారి తీసింది. ఆదార్ అప్‌డేట్ విషయంలో వీఆర్వోలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆర్డీవో, ఒడిసి మండలానికి చెందిన ఒక వీఆర్వోను సమక్షంలో గుంజీలు తీయించారని ఆరోపణలతో వీఆర్వోలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయంలో ఆధార్ అప్‌డేట్ పై వీఆర్వోలకు శిక్షణ కార్యక్రమం జరిగింది.
#image_title
గుంజీలు తీయించడమేంటి..
ఈ సందర్భంగా ఒడిసి మండలం వీఆర్వో ఆధార్ అప్డేషన్‌లో వెనకబడ్డాడంటూ ఆర్డీవో సువర్ణ తీవ్రంగా మండిపడ్డారు. వీఆర్వో తన అభ్యంతరాలను వివరించగా ..వలసలపై, జనాభా లేమిపై వివరణ ఇచ్చినా ఆర్డీవో ఆగ్రహాన్ని చల్లబరచలేకపోయాడు. చివరికి సువర్ణ “గుంజీలు తీయాలి” అంటూ ఆదేశించడంతో, వీఆర్వో మిగతా అధికారుల సమక్షంలో గుంజీలు తీయాల్సి వచ్చింది.
ఈ దృశ్యం చూసిన మిగతా వీఆర్వోలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అనుచితమని, అధికార నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ఆర్డీవో సువర్ణ వ్యవహారం నియంతృత్వ ధోరణిని ప్రతిబింబిస్తుందని మండిపడ్డారు. వాగ్వాదానికి దిగి, గుంజీలు తీయడం తగదని చెప్పారు. అయినప్పటికీ, సువర్ణ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు.దీనిపై తీవ్రంగా స్పందించిన వీఆర్వోలు చివరకు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్‌ను ఆశ్రయించారు.