T20 World Cup 2024 : మ్యాచ్‌కి అదే ట‌ర్నింగ్ పాయింట్.. 17 ఏళ్ల త‌ర్వాత టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో జ‌గజ్జేత‌గా నిలిచిన టీమిండియా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

T20 World Cup 2024 : మ్యాచ్‌కి అదే ట‌ర్నింగ్ పాయింట్.. 17 ఏళ్ల త‌ర్వాత టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో జ‌గజ్జేత‌గా నిలిచిన టీమిండియా

 Authored By ramu | The Telugu News | Updated on :30 June 2024,10:00 am

T20 World Cup 2024 : టీమిండియా ఎట్ట‌కేల‌కి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ని ముద్దాడింది. దీంతో అనేక విమ‌ర్శ‌ల‌కి చెక్ పెట్టింది. స్వ‌దేశంలోనే పులులన్న మాటను తుడిచిపెడుతూ ఓటమన్నదే లేకుండా 2024 టి20 ప్రపంచకప్​కి ముద్దాడింది. దీంతో భార‌త అభిమానుల ఆనందం క‌ట్ట‌లు తెంచుకుంది. చివ‌రి వ‌ర‌కు నువ్వా నేనా అన్న‌ట్టు మ్యాచ్ సాగ‌గా, ఆ క‌ప్ భార‌త్ చెంత‌కే చేరింది. ముందుగా బ్యాటింగ్​ చేసి 176 పరుగులు చేసిన భారత్​, తర్వాత దక్షిణాఫ్రికాను 169 పరుగుల వద్దే కట్టడి చేసి సగర్వంగా కప్​ను గెల్చుకుంది. మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​గా విరాట్​ కోహ్లీ(76 పరుగులు), మ్యాన్​ ఆఫ్ ది సిరీస్​గా జస్​ప్రీత్​ బుమ్రా(15 వికెట్లు) ఎంపికయ్యారు. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియాకు రెండో టీ20 ప్రపంచకప్ దక్కింది.

T20 World Cup 2024 ఇది క‌దా విజ‌యం అంటే..

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయిన భారత స్టార్ విరాట్ కోహ్లీ.. ఫైనల్‍లో మాత్రం అదరగొట్టాడు. రోహిత్ శ‌ర్మ న‌మ్మకాన్ని నిల‌బెట్టాడు. 59 బంతుల్లోనే 76 పరుగులతో అత్యంత ముఖ్యమైన హాఫ్ సెంచరీ చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది ట‌ఫ్ టార్గెట్ సౌతాఫ్రికా ముందు ఉండేలా చేశారు. ఇక అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47), శివమ్ దూబే (16 బంతుల్లో 27 రన్స్) రాణించారు. ఈ ముగ్గురు విలువైన పరుగులు రాబ‌ట్ట‌డంతోనే భార‌త్ 176 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. అయితే సౌతాఫ్రికా టార్గెట్‌ని చేధించే క్ర‌మంలో ఎక్క‌డ కూడా వెన‌క‌డుగు వేయ‌లేదు. వికెట్స్ ప‌డుతున్నా కూడా ధాటిగా ఆడారు. ఓ దశలో దక్షిణాఫ్రికా గెలుపునకు 30 బంతులకు 30 పరుగులే చేయాల్సి ఉంది. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నారు.

T20 World Cup 2024 మ్యాచ్‌కి అదే ట‌ర్నింగ్ పాయింట్ 17 ఏళ్ల త‌ర్వాత టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో జ‌గజ్జేత‌గా నిలిచిన టీమిండియా

T20 World Cup 2024 : మ్యాచ్‌కి అదే ట‌ర్నింగ్ పాయింట్.. 17 ఏళ్ల త‌ర్వాత టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో జ‌గజ్జేత‌గా నిలిచిన టీమిండియా

ఇక ఆ స‌మ‌యంలో అంద‌రు కూడా సౌతాఫ్రికా విజ‌యం ఖాయ‌మ‌ని డిసైడ్ అయ్యారు. అయితే 16వ ఓవ‌ర్‌లో బుమ్రా రంగంలోకి దిగాడు. కేవలం 4 పరుగులే ఇచ్చాడు. ఇక 17వ ఓవర్లో జోరు మీద ఉన్న హెన్రిచ్ క్లాసెన్ (52)ను ఔచ్ చేసిన హార్దిక్ పాండ్యా కేవలం 4 రన్సే ఇచ్చాడు. అదే మ్యాచ్‌కి ట‌ర్నింగ్ పాయింట్‌. 18వ ఓవర్లో జస్‍ప్రీత్ బుమ్రా మ్యాజిక్ చేశాడు. రెండు రన్స్ మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. 19వ ఓవర్లో అర్షదీప్ కూడా 4 పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్లో పాండ్యా మిల్ల‌ర్‌ని ఔట్ చేసి 8 పరుగులకే కట్టడి చేశాడు. దీంతో భారత ఓటమి అంచు నుంచి గెలిచింది. టీమిండియా బౌలర్లు అద్భుతం చేశారు. అయితే చివ‌రి ఓవ‌ర్‌లో సూర్య కుమార్ యాద‌వ్.. మిల్ల‌ర్ క్యాచ్ చాలా అద్భుతంగా అందుకున్నాడు. అది మిస్ చేసిన ఫ‌లితం మ‌రోలా ఉండేదది. ఫైనల్ గెలిచాక కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహా పలువురు భారత ప్లేయర్లు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు…

T20 World Cup 2024 మ్యాచ్‌కి అదే ట‌ర్నింగ్ పాయింట్ 17 ఏళ్ల త‌ర్వాత టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో జ‌గజ్జేత‌గా నిలిచిన టీమిండియా

T20 World Cup 2024 : మ్యాచ్‌కి అదే ట‌ర్నింగ్ పాయింట్.. 17 ఏళ్ల త‌ర్వాత టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో జ‌గజ్జేత‌గా నిలిచిన టీమిండియా

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది