T20 World Cup 2024 : టీమిండియా ఎట్టకేలకి టీ20 వరల్డ్ కప్‌ని ముద్దాడింది. దీంతో అనేక విమర్శలకి చెక్ పెట్టింది. స్వదేశంలోనే పులులన్న మాటను తుడిచిపెడుతూ ఓటమన్నదే లేకుండా 2024 టి20 ప్రపంచకప్‌కి ముద్దాడింది. దీంతో భారత అభిమానుల ఆనందం కట్టలు తెంచుకుంది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్టు మ్యాచ్ సాగగా, ఆ కప్ భారత్ చెంతకే చేరింది. ముందుగా బ్యాటింగ్ చేసి 176 పరుగులు చేసిన భారత్, తర్వాత దక్షిణాఫ్రికాను 169 పరుగుల వద్దే కట్టడి చేసి సగర్వంగా కప్‌ను గెల్చుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ(76 పరుగులు), మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా జస్‍ప్రీత్ బుమ్రా(15 వికెట్లు) ఎంపికయ్యారు. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియాకు రెండో టీ20 ప్రపంచకప్ దక్కింది.
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయిన భారత స్టార్ విరాట్ కోహ్లీ.. ఫైనల్‍లో మాత్రం అదరగొట్టాడు. రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టాడు. 59 బంతుల్లోనే 76 పరుగులతో అత్యంత ముఖ్యమైన హాఫ్ సెంచరీ చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది టఫ్ టార్గెట్ సౌతాఫ్రికా ముందు ఉండేలా చేశారు. ఇక అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47), శివమ్ దూబే (16 బంతుల్లో 27 రన్స్) రాణించారు. ఈ ముగ్గురు విలువైన పరుగులు రాబట్టడంతోనే భారత్ 176 పరుగులు చేయగలిగింది. అయితే సౌతాఫ్రికా టార్గెట్‌ని చేధించే క్రమంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. వికెట్స్ పడుతున్నా కూడా ధాటిగా ఆడారు. ఓ దశలో దక్షిణాఫ్రికా గెలుపునకు 30 బంతులకు 30 పరుగులే చేయాల్సి ఉంది. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నారు.
ఇక ఆ సమయంలో అందరు కూడా సౌతాఫ్రికా విజయం ఖాయమని డిసైడ్ అయ్యారు. అయితే 16వ ఓవర్‌లో బుమ్రా రంగంలోకి దిగాడు. కేవలం 4 పరుగులే ఇచ్చాడు. ఇక 17వ ఓవర్లో జోరు మీద ఉన్న హెన్రిచ్ క్లాసెన్ (52)ను ఔచ్ చేసిన హార్దిక్ పాండ్యా కేవలం 4 రన్సే ఇచ్చాడు. అదే మ్యాచ్‌కి టర్నింగ్ పాయింట్. 18వ ఓవర్లో జస్‍ప్రీత్ బుమ్రా మ్యాజిక్ చేశాడు. రెండు రన్స్ మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. 19వ ఓవర్లో అర్షదీప్ కూడా 4 పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్లో పాండ్యా మిల్లర్‌ని ఔట్ చేసి 8 పరుగులకే కట్టడి చేశాడు. దీంతో భారత ఓటమి అంచు నుంచి గెలిచింది. టీమిండియా బౌలర్లు అద్భుతం చేశారు. అయితే చివరి ఓవర్‌లో సూర్య కుమార్ యాదవ్.. మిల్లర్ క్యాచ్ చాలా అద్భుతంగా అందుకున్నాడు. అది మిస్ చేసిన ఫలితం మరోలా ఉండేదది. ఫైనల్ గెలిచాక కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహా పలువురు భారత ప్లేయర్లు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
This website uses cookies.