Tarakaratna- Suhasini : సొంత తమ్ముడు రాకపోయినా.. సుహాసిని కోసం ప్రచారం చేసిన తారకరత్న
Tarakaratna- Suhasini : నందమూరి తారకరత్న ఇక లేరు. ఆయన లేరనే విషయాన్ని నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్న 23 రోజుల పాటు పోరాడి చివరకు తుదిశ్వాస విడిచారు. విదేశాల నుంచి వచ్చిన వైద్య బృందం ఎంత ప్రయత్నించినా ఆయన ప్రాణాలు మాత్రం దక్కలేదు. 40 ఏళ్ల వయసులోనే తారకరత్న ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. దీంతో సినీ లోకం ఒక్కసారిగా మూగబోయింది. తారకరత్న తెలుగు సినిమాకు చేసిన సేవలను ఈసందర్భంగా గుర్తు చేసుకుంటోంది. నిజానికి.. తారకరత్న సినిమా ఎంట్రీ గ్రాండ్ గానే జరిగింది. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తారకరత్న హిట్ కొట్టాడు కానీ..
ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. దీంతో హీరో పాత్రలు కాకుండా విలన్ గానూ ఆయన మెప్పించారు. 2002 లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తారకరత్న ఆ తర్వాత ఒకేసారి చాలాసినిమాలకు సైన్ చేసినా ఏ సినిమా అంతగా ఆడలేదు. అయితే.. తారకరత్నకు అమరావతి అనే సినిమాతో నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో విలన్ గానే నటించారు. ఇటీవల వెబ్ సిరీస్ లోనూ నటించారు. ఆయన రాజకీయ విషయాల గురించి చెప్పుకుంటే.. ఆయన టీడీపీకి మద్దతుగా ఉండేవారు. టీడీపీకి మద్దతు ఇస్తూ ఉండేవారు.
Tarakaratna- Suhasini : అమరావతి సినిమాకు నంది అవార్డు
నారా లోకేష్, చంద్రబాబుతో మంచిగా ఉండేవారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ తరుపున ప్రచారం చేశారు తారకరత్న. 2018 లో కూకట్ పల్లి నుంచి నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని పోటీ చేశారు. అప్పుడు తన సొంత సోదరులు జూనియర్ ఎన్టీఆర్ కానీ.. కళ్యాణ్ రామ్ కానీ ప్రచారంలో పాల్గొనలేదు. కానీ.. తారకరత్న మాత్రం ఇంటింటికి తిరిగి సుహాసిని తరుపున పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు తారకరత్న. నారా లోకేష్ పాదయాత్రలోనూ అందుకే పాల్గొన్నారు. కానీ.. ఆ రోజే ఆయనకు గుండె పోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. 23 రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయారు.