TDP Chief Chandrababu Facing Jai NTR Heat.!
Chandrababu : రాజకీయం, సినిమా వేర్వేరు కాదంటారు కొందరు. సరే, దానికీ దీనికీ సంబంధం ఏంటన్నది వేరే చర్చ. తెలుగునాట రాజకీయాలకీ, సినిమాకీ విడదీయరాని బంధం వుంది. పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లో వున్నారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగు నాట కొత్త రాజకీయ పార్టీని స్థాపించి, దేశ రాజకీయాలపైనా తనదైన ముద్ర వేశారు. తెలుగు నాట పార్టీ పెడుతూనే రికార్డు సమయంలో అధికారంలోకి వచ్చారు స్వర్గీయ ఎన్టీయార్. ఆ రికార్డుని ఇంకెవరూ ఇప్పట్లో బ్రేక్ చేయలేరు కూడా. ఆ పార్టీ పేరు తెలుగుదేశం. అదిప్పుడు తెలంగాణ నేలపై దాదాపు కనుమరుగైపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొసప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. మరి, ఆ పార్టీకి ఆక్సిజన్ ఇచ్చే శక్తి ఎవరికి వుంది.?
ఇంకెవరికి, ఆ స్వర్గీయ ఎన్టీయార్ మనవడైన యంగ్ టైగర్ ఎన్టీయార్‌కేనంటున్నారు అభిమానులు. ఆ సెగని, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చాలా గట్టిగానే ఎదుర్కొంటున్నారు. తాజాగా, చంద్రబాబుకి ‘జై ఎన్టీఆర్’ సెగ తగిలింది. నిజానికి, గత కొంతకాలంగా ఆయన ఈ సెగని తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడది మరింత ఎక్కువైందంతే.
గతంలో యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయించుకున్న చంద్రబాబు, ఆ తర్వాత తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం అతన్ని పార్టీకి చాలా దూరంగా పంపేశారు. అప్పటినుంచి, రాజకీయాల వైపు అస్సలు ఆసక్తి చూపడంలేదు జూనియర్ ఎన్టీయార్.
TDP Chief Chandrababu Facing Jai NTR Heat.!
అయితే, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఊరుకోవడంలేదు. వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ఎన్టీఆర్‌కి ప్రాధాన్యతనివ్వాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘జై ఎన్టీఆర్’ నినాదాలతోపాటు, ప్రత్యేకంగా రూపొందించిన జెండాలతోనూ చంద్రబాబుకి నిరసన సెగ తగిలేలా చేస్తున్నారు. కానీ, స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగనిదే, చంద్రబాబు మెట్టు దిగే పరిస్థితి వుండదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి ఎన్టీఆర్ ఇమేజ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందిగానీ, అలా చేస్తే నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోతుందని చంద్రబాబుకి బాగా తెలుసు.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.