will TDP MLA from Gannavaram in the next election
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రెండున్నరేళ్ల పాలన పూర్తి అవుతున్న సందర్భంగా చేయించుకున్న సర్వే వైసీపీలో ఆందోళనను రేకెత్తిస్తే.. టీడీపీకి ఏకంగా ఊపిరే పోసిందట. రాజకీయాల్లో ఓ పార్టీ ఆందోళనలో కూరుకుపోతే.. దాని ప్రత్యర్థికి కొత్త శక్తి వచ్చినట్టే కదా. ఆ లెక్క మాదిరిగానే.. ఏపీలో వైసీపీలో కొత్తగా రేకెత్తిన ఆందోళన.. టీడీపీకి కొత్త జవసత్వాలను ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఇందుకు నిదర్శనంగా వైసీపీ అధికారంలోకి రాగానే.. దాదాపుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా కనిపించిన టీడీపీ కీలక నేతలు ఒక్కరొక్కరుగా మళ్లీ తెర ముందుకు వస్తున్నారని సమాచారం.. ఈ పరిణామాలు టీడీపీలో కొత్త ఆశలను చిగురింపజేస్తుంటే.. వైసీపీలో మాత్రం బీపీని పెంచేస్తున్నాయి.
TDP
2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ విక్టరీ కొట్టగానే.. ఊహకే అందని పూర్ ఫెర్‌ఫార్మెన్స్ కనబరచిన టీడీపీ విపక్ష స్థానంలో కూర్చోక తప్పలేదు. అయితే సీఎంగా పదవీ ప్రమాణం రోజే.. టీడీపీ పాలనపై విచారణ జరుపుతామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో పెను కలవరాన్నే రేపాయి. ఈ క్రమంలో టీడీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన వారంతా క్రమంగా అదృశ్యమయ్యారు. కొందరు తమ కార్యక్షేత్రాన్ని దాదాపుగా మూసేస్తూ హైదరాబాద్ చేరుకుంటే.. మరికొందరు రాజకీయాలను పూర్తిగా పక్కనపెట్టినట్టుగా వ్యవహరించడం మొదలెట్టారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు దిక్కు తోచని స్థితిలో పడిపోయాయి.
అదే సమయంలో వైసీపీపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు జగన్ చేయించుకున్న సర్వేలో.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఏకంగా 60 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓడిపోతారని, వీరిలో ఏకంగా 11 మంది మంత్రులు కూడా ఉన్నారని, మరో 20 మంది దాకా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కోక తప్పదని తేలింది. ఈ వార్తలతో వైసీపీలో ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది. అదేసమయంలో ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉండగానే.. వైసీపీపై వ్యతిరేకత ఏర్పడిందంటే.. భవిష్యత్తు తమదేనన్న భావన టీడీపీలో వ్యక్తమైంది.
TDP Ysrcp
ఈ విషయం తెలిసిన మరుక్షణమే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నేతలంతా వరుసగా విజయవాడకు క్యూ కడుతున్నారని సమాచారం. ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి విజయవాడ చేరుకుని యాక్టివ్ గా మారిపోయారని తెలుస్తోంది.ఇదే బాటలో మరికొందరు కీలక నేతలు కూడా యాక్టివేట్ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. వెరసి వైసీపీ చేయించుకున్న సర్వే టీడీపీలో జోష్ నింపిందన్న వార్త సర్వత్రా వినిపిస్తోంది. మళ్లీ ఎన్నికలు వస్తే.. టీడీపీకే ఓటు వేస్తామని.. చంద్రబాబునే సీఎం చేస్తామని.. సర్వేల్లో తేల్చి చెబుతున్నారు ఏపీ ప్రజలు. జగన్‌కు ఒక్కఛాన్స్ మాత్రమే ఇచ్చామని.. మరో ఛాన్స్ ఇచ్చే సమస్యే లేదని సర్వేలతో స్పష్టం చేస్తున్నారు. ఇండియా టుడే.. లోకల్ యాప్.. వరుస సర్వేల ఫలితాలు టీడీపీలో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. తెలుగు తమ్ముళ్లలో సరికొత్త జోష్ కనబడుతోంది. అదే సమయంలో వైసీపీలో ఆందోళన చెలరేగుతోంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.