peddireddy : వాళ్లు పెద్దిరెడ్డిని కట్టడి చేస్తారా…?
peddireddy పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి ఈ పేరు తెలియని వారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండరంటే అతి శయోక్తి కాదు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనేక విషయాల్లో జగన్ కు పార్టీకి సహాయం చేస్తూ ఉంటారు. ప్రతి పక్ష టీడీపీ పార్టీని తనదైన మాటలతో చాలా బాగా ఇరుకున పెడతారు. ఈ విషయమే చంద్రబాబుకు నచ్చడం లేదని ఏపీలో చాలా మంది గుసగుసలాడుకుంటున్నారు. ఎలాగైనా సరే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి చెక్ పెట్టాలని బాబు చూస్తున్నట్లు వినికిడి. పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచారు.
2009 నుంచి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డికి అక్కడ ఎదురన్నదే లేదు. పెద్ది రెడ్డి పుంగనూరు నియోజకవర్గంతో పాటు బాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గం మీద కూడా కాన్సంట్రేట్ చేస్తున్నారు.ప్రస్తుతం కుప్పంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో గనుక టీడీపీ చేతిలో వైసీపీ ఓడిపోతే అది పెద్దిరెడ్డికి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. అందుకోసమే చంద్రబాబు కుప్పం మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
peddireddy : వైసీపీ ఓడితే పెద్దిరెడ్డి ఓడినట్లేనట..
ఎలాగైనా సరే ఇక్కడి ఎన్నికల్లో వైసీపీని ఓడించి పెద్ది రెడ్డి దూకుడుకు కట్టడి చేయాలని టీడీపీ భావిస్తోంది. పెద్ది రెడ్డి వ్యవహారం రోజురోజుకూ చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారుతుందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అందుకోసమే పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు స్వయంగా ఫోకస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డిని కట్టడి చేసేందుకు టీడీపీ పార్టీ చల్లా రామచంద్రా రెడ్డిని కుప్పంలో ఇన్ చార్జిగా నియమించింది. పెద్ది రెడ్డి మీద పెద్దగా అవినీతి ఆరోపణలు కూడా లేకపోవడంతో టీడీపీ పార్టీ వెనకా ముందు సంశయిస్తోంది.