Janasena – TDP : జనసేన పార్టీకి టీడీపీనే అసలైన ప్రత్యర్థి.. ఎందుకంటే?
Janasena – TDP : ఎక్కడైనా సరే.. ఏ రాజకీయ పార్టీ అయినా సరే.. వాళ్ల అల్టిమేట్ గోల్ ఏంటి.. గెలవడం. వాళ్లు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా వాళ్ల చివరి టార్గెట్ మాత్రం అదే. గెలవడమే అంతిమంగా ఏ పార్టీ అయినా కోరుకునేది. ఏ ఎన్నికల్లో అయినా గెలవాల్సింది ఒక్కటే పార్టీ. రెండు మూడు పార్టీలు గెలిచే చాన్స్ ఉండదు కదా. అందుకే తామే గెలవాలని ప్రతి పార్టీ కోరుకుంటుంది. ఒక్కటే సింహాసనం ఉన్నప్పుడు ఎన్ని పార్టీలు అయినా ఏం చేసినా గెలవడం కోసమే. పవర్ కోసమే. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీల హడావుడి కూడా పెరుగుతుంది.
పేరుకు కొన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తాయి కానీ.. వాటి అల్టిమేట్ గోల్ మాత్రం తమ పార్టీ గెలవడమే. పేరుకు కలిసి పోటీ చేసినా ఎన్నికల తర్వాత ఆ పప్పులేవీ ఉడకవు. ఇక.. ఏపీ విషయానికి వస్తే ఏపీలో ప్రస్తుతం మూడు పార్టీలు అధికారం కోసం తెగ ఎదురు చూస్తున్నాయి. ఒకటి అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కాగా.. రెండో చాన్స్ కోసం ప్రజల దగ్గరికి వెళ్తోంది. ఇక.. చివరి చాన్స్ అంటూ టీడీపీ, ఒక్క చాన్స్ అంటూ జనసేన ఈ మూడు పార్టీలు అధికారం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి.
Janasena – TDP : జనసేన ఫోకస్ మొత్తం వైసీపీ మీదనే
టీడీపీ జనసేన పార్టీని తమ ప్రత్యర్థిగానే చూస్తోంది. కానీ.. జనసేన పార్టీ మాత్రం ఏపీలో తనకు ప్రత్యర్థ పార్టీ టీడీపీ అని అనుకోవడం లేదు. కేవలం వైసీపీ మాత్రమే అనుకుంటోంది. వైసీపీని గద్దె దించడం కోసం మాత్రమే జనసేన పని చేస్తోంది. కానీ.. టీడీపీని జనసేన ఎందుకు ప్రత్యర్థిగా భావించడం లేదు. వైసీపీ గద్దె దిగినంత మాత్రాన జనసేనకు అధికారం వస్తుందా? అస్సలు రాదు. మధ్యలో చంద్రబాబు కూడా ఉన్నారు. వైసీపీ గద్దె దిగినా కూడా టీడీపీ గెలిచే చాన్స్ ఉంది కదా. టీడీపీ గెలిచినప్పుడు జనసేనకు అధికారం ఎలా వస్తుంది. ఈ చిన్న లాజిక్ ను జనసేన ఎందుకు మిస్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఎందుకు టీడీపీని గుడ్డిగా నమ్ముతున్నారో తెలియదు కానీ.. అసలు టీడీపీనే తన అసలైన ప్రత్యర్థి అని పవన్ కళ్యాణ్ తెలుసుకుంటేనే వచ్చే ఎన్నికల్లో గెలిచే చాన్సెస్ ఉంటాయి. లేకపోతే మరోసారి జనసేన అడ్డంగా ఓడిపోయే ప్రమాదం ఉంది.