TDP : కొడుకును ఎమ్మెల్యేగా చూడాలన్న ఆ టీడీపీ నేత ఆశ.. ఈసారైనా నెరవేరుతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP : కొడుకును ఎమ్మెల్యేగా చూడాలన్న ఆ టీడీపీ నేత ఆశ.. ఈసారైనా నెరవేరుతుందా?

 Authored By sukanya | The Telugu News | Updated on :11 July 2021,9:00 am

TDP విశాఖపట్నం జిల్లా న‌ర్సీప‌ట్నం పేరు చెప్పగానే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరు గుర్తు రావాల్సిందే. టీడీపీ TDP లోనే రాజకీయ జీవితం మొదలుపెట్టిన అయ్యన్న ఆరు సార్లు నర్సీపట్నం నుంచి గెలిచారు. అయ్యన్న పోరాటానికి ఆయన వారసుడు చింతకాయల విజయ్ మద్ధతుగా కూడా ఎక్కువగానే ఉంది. విజయ్ సైతం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. తండ్రికి సపోర్ట్‌గా ఉంటూ, పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో జగన్ వేవ్ ఉన్నా సరే, నర్సీపట్నంలో టీడీపీ కొద్దిగా పోటీలో నిలబడగలిగింది. నర్సీపట్నం మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉంటే వైసీపీ 14 గెలుచుకుంటే, టీడీపీ TDP 12 గెలుచుకుంది. ఇక విజయ్ సైతం కౌన్సిలర్ గా గెలిచి, తన సత్తా చాటుకున్నారు.

TDP

TDP

ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు ..TDP

ఈనేపథ్యంలో విజయ్ వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల్లోనే వారసుడుకు టిక్కెట్ ఇప్పించుకోవాలని అయ్యన్నపాత్రుడు చూశారు. కానీ చంద్రబాబు ఒక ఫ్యామిలీకి ఒకటే టిక్కెట్ అని చెప్పడంతో అయ్యన్నపాత్రుడు ఒక్కరే పోటీలోకి దిగారు. న‌ర్సీప‌ట్నం ఎమ్మెల్యేగా ఒక‌రు, అన‌కాప‌ల్లి ఎంపీగా ఒక‌రు పోటీ చేయాల‌నుకున్న చంద్రబాబు ఇష్టప‌డ‌లేదు.

TDP Leader Ayyanna Patrudu

TDP Leader Ayyanna Patrudu

2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆడారి ఆనంద్ వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో అనకాపల్లి పార్లమెంట్ సీటు ఖాళీగానే ఉంది. దీంతో ఈ ప‌రిస్థితుల్లో చంద్రబాబు త‌మ ఫ్యామిలీకి రెండు సీట్లు ఎందుకు ఇవ్వర‌న్న ధీమా అయ్యన్నపాత్రుడులో ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు టిక్కెట్లకు ఛాన్స్ లేక‌పోతే అయ్యన్నపాత్రుడు రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని విజయ్‌కు కూడా టిక్కెట్ దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మ‌రి అయ్యన్న మాట ఏమేరకు చెల్లుతుందో వేచి చూడాల్సిందే.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది