Nara Lokesh : జగన్ మోహన్ రెడ్డి చేతిలో నారా లోకేశ్ భవిష్యత్తు?
Nara Lokesh : 2024 ఎన్నికలను టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే.. 2024 లో ఒకవేళ గెలవకపోతే ఇక ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరమే. ఏ రకంగా చూసినా 2024 ఎన్నికలు అనేవి టీడీపీ పార్టీకే చావో రేవో అన్నట్టుగా మారాయి. అందుకే వేరే పార్టీలను కలుపుకొని అయినా వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని చంద్రబాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది లాస్ట్ చాన్స్ అని చంద్రబాబు కూడా అనుకుంటున్నారు. తన కొడుకు నారా లోకేశ్ భవితవ్యం కూడా ఈ ఎన్నికల్లోనే తేలిపోనుంది. నిజానికి టీడీపీ పార్టీని భూస్థాపితం చేసి ఇక మరో రెండు దశాబ్దాల వరకు ఏపీని ఏలాలి అనేది సీఎం జగన్ కల. దాన్ని చెరిపేయాలని టీడీపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది.
అందుకే.. తనను తాను ఒక నాయకుడిగా ప్రూవ్ చేసుకునేందుకు నారా లోకేశ్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకే సుదీర్ఘ పాదయాత్రకు తెర లేపారు. ఈనెల 27 నుంచే నారా లోకేశ్ అది పెద్ద పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి నారా లోకేశ్ అడుగులు వేయబోతున్నారు. ఈ పాదయాత్ర సుమారు 400 రోజుల పాటు ఉండనుంది. అంటే సంవత్సరం మీద నెల రోజులు అన్నమాట. దాదాపు 4 వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. పాదయాత్రకు మరో 17 రోజుల సమయమే ఉండటంతో పాదయాత్ర అనుమతి కోసం ఇప్పటికే ఏపీ డీజీపీకి టీడీపీ లేఖ రాసింది.
Nara Lokesh : పాదయాత్రలో లోకేశ్ కు భద్రత కల్పించాలని డీజీపీకి లేఖ
అయితే.. నారా లోకేశ్ పాదయాత్ర విషయంలో చాలా హెచ్చరికలు వస్తున్నాయని, ఫ్యాక్షనిస్టులు, తీవ్రవాదులు, రాజకీయ ప్రత్యర్థుల నుంచి నారా లోకేశ్ కు బెదిరింపులు వస్తున్నాయని భావించిన టీడీపీ.. లోకేశ్ పాదయాత్ర విషయంలో డీజీపీకి లేఖ రాసింది. అయితే.. నారా లోకేశ్ పాదయాత్ర విజయవంతం అవుతుందా? లేదా? అనేది ఏకంగా సీఎం జగన్ చేతుల్లోనే ఉంది అనే అభిప్రాయాలు తాజాగా వ్యక్తం అవుతున్నాయి. నారా లోకేశ్ పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా ఉంటేనే ఆయన పాదయాత్ర సక్సెస్ అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం అడ్డుకుంటే మాత్రం పాదయాత్ర అటకెక్కినట్టే. అందుకే.. లోకేశ్ పాదయాత్ర, ఆయన రాజకీయ భవితవ్వం అంతా జగన్ మోహన్ రెడ్డి చేతుల్లో ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.