YSRCP Schemes : సంక్షేమ పథకాలపై ఆగని ప్రతిపక్షాల కుట్ర | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

YSRCP Schemes : సంక్షేమ పథకాలపై ఆగని ప్రతిపక్షాల కుట్ర

YSRCP Schemes : గతంలో ఎప్పుడు లేనన్ని సంక్షేమ పథకాలు.. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు అవ్వని సంక్షేమ పథకాలు ఏపీలో అమలు అవుతున్నాయి. ప్రతి ఒక్క వెనుకబడిన వ్యక్తికి కూడా ఏదో ఒక విధంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అద్బుతమైన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నా కూడా ఇప్పటి వరకు తెలుగు దేశం పార్టీ ఇంకా విమర్శిస్తూ జనాలను మోసగించే విధంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను విమర్శిస్తే జనాలను […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 June 2022,10:00 am

YSRCP Schemes : గతంలో ఎప్పుడు లేనన్ని సంక్షేమ పథకాలు.. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు అవ్వని సంక్షేమ పథకాలు ఏపీలో అమలు అవుతున్నాయి. ప్రతి ఒక్క వెనుకబడిన వ్యక్తికి కూడా ఏదో ఒక విధంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అద్బుతమైన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నా కూడా ఇప్పటి వరకు తెలుగు దేశం పార్టీ ఇంకా విమర్శిస్తూ జనాలను మోసగించే విధంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను విమర్శిస్తే జనాలను అవమానించినట్లే అయినా కూడా టీడీపీ మాత్రం కుట్ర పూరితంగా సంక్షేమ పథకాల గురించి అబద్దపు ప్రచారం చేస్తూ ఉన్నారు.

సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా వృద్యాప్య పించన్ ఇంకా వెనుకబడిన వారికి ఆర్థిక సాయం ఇంకా అమ్మ ఒడి. ఈ పథకాల విషయంలో ఎప్పటికప్పుడు తెలుగు దేశం పార్టీ అక్కస్సు వెళ్లగక్కుతూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ పథకాల లబ్ది దారులను భయాందోళనకు గురి చేసే విధంగా నిధులు లేమితో పథకాలను నిలిపి వేస్తున్నారు అంటూ పుకార్లు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పుకార్లను ఒకటి రెండు రోజుల్లో వైకాపా నాయకులు మరియు ప్రభుత్వ వర్గాల వారు ఫాక్ట్ చెక్ పేరుతో క్లారిటీ ఇస్తున్నారు. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ వారిపై జనాలు దుమ్మెత్తి పోస్తున్నారు.

TDP Leaders comments on YSRCP Schemes government

TDP Leaders comments on YSRCP Schemes government

సంక్షేమ పథకాల అమలు నిలుపుదల అనేది అస్సలు జరగదు. సంక్షేమ పథకాలకు నిధులు పెంపుదల ఉంటుంది కాని.. ఎప్పుడు కూడా నిలిపి వేయడం అనేది జరగదు. అలాంటి సంక్షేమ పథకాలను టీడీపీ వస్తే నిలిపి వేసే అవకాశం ఉంది కాని వైకాపా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా సంక్షేమ పథకాలను నిధుల లేమి పేరుతో నిలిపి వేయడం చేయదు అంటూ ఆ పార్టీ నాయకులు మరియు మంత్రులు చెప్పుకొచ్చారు. తెలుగు దేశం పార్టీ నాయకులు సంక్షేమ పథకాల భయంతో మళ్లీ అధికారంలోకి రామనే ఉద్దేశ్యంతో సంక్షేమ పథకాలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది